Home » BSP
దేశంలో సార్వత్రిక ఎన్నికల ముందు బీఎస్పీ అధినేత మాయావతి తన రాజకీయ వారసుడి బాధ్యతల నుంచి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను తొలగించారు. అదేవిధంగా పార్టీలో అన్ని బాధ్యతల నుంచి తప్పించారు. ఎన్నికల తర్వాత మాయావతి తన మనసు మార్చకుని మరోసారి తన రాజకీయ వారసుడిగా ఆకాష్ ఆనంద్ పేరును ప్రకటించారు.
లోక్ సభ ఎన్నికల్లో వివిధ వర్గాల నుంచి పార్టీలకు వచ్చిన ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే.. దళితుల ఓటు(Dalit votes) బ్యాంకు కీలకంగా కనిపిస్తోంది. చాలా నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో దళితులు ఉండటంతో ఈ ఎన్నికల్లో వారి ఓట్లు ఎవరికి ఎక్కువగా పడ్డాయన్నది ఆసక్తికరంగా మారింది.
ఉత్తరప్రదేశ్(UP) ఎన్ని్కల్లో గణనీయమైన సీట్లు సాధిస్తామని ధీమాగా ఉన్న బహుజన్ సమాజ్ వాదీ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. అక్కడి లోక్ సభ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటులో బీఎస్పీ గెలవలేకపోయింది.
దళితుల గొంతుకగా పేరొందిన బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ), ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతి కథ ముగిసిందా ?. బెహన్జీ(అక్కగారు), ఉక్కు మహిళ(ఐరన్ లేడీ)గా ఖ్యాతి పొందిన బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి మ్యాజిక్కు కాలం చెల్లిందా ? అంటే, అవును అనే సమాధానమే వస్తోంది. ఎన్నికల్లో బీఎస్పీ
న్యూఢిల్లీ: ఢిల్లీలో అధికారంలో ఉన్న 'ఆమ్ ఆద్మీ పార్టీ' (AAP), ఉత్తరప్రదేశ్‌లో ఒకప్పుడు చక్రం తిప్పి, గత ఎన్నికల్లోనూ గట్టి ఉనికిని చాటుకున్న మాయావతి సారధ్యంలోని బీఎస్పీకి 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి.
ఉత్తరప్రదేశ్‌లో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య ప్రధాన పోరు కొనసాగుతున్న వేళ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్.. బీఎస్పీ అధినేత్రి మాయావతిని టార్గెట్ చేశారు. మరోవైపు అఖిలేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాయావతి. బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ పదవి నుంచి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను మాయావతి తప్పించారు. ఏడాది క్రితం ఇచ్చిన వారసత్వ బాధ్యతల నుంచి కూడా తప్పించినట్లు ప్రకటించారు. దీంతో మాయావతి తీసుకున్న ఈ నిర్ణయంపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను పార్టీ జాతీయ సమన్వయకర్త పదవి నుంచి తొలగిస్తున్నట్లు బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. ఈ విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలు కావడంతో భారతీయ పౌరసత్వం ఉన్న వ్యక్తి దేశంలో ఏ లోక్‌సభ స్థానంలో అయినా పోటీ చేయవచ్చు. మరోవైపు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లి స్థిరపడిన వ్యక్తులు అక్కడి రాజకీయాల్లో రాణిస్తున్నవారెందరో ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతోమంది ఇతర రాష్ట్రాల్లో రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తులు ఉన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోనే ఎక్కువ లోక్‌సభ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్‌లోని జాన్పూర్ పార్లమెంట్ నియోజకవర్గం అందరిదృష్టిని ఆకర్షించింది.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఏడు విడతలకు గానూ మూడో విడత పోలింగ్ ఇవాళ ప్రారంభమైంది. 12 రాష్ట్రాల్లోని 93 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. బీజేపీ, కాంగ్రెస్‌లను భయం వెంటాడుతోంది. మూడో దశలో ఎన్నికలు జరగనున్న స్థానాల్లో 2014, 2019లో ఎన్డీయే కూటమి మెజార్టీ సీట్లు సాధించింది. బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలంటే ఈ విడతలో ఎక్కవ స్థానాలు గెలవాల్సి ఉంటుంది.
మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పలువురు ముస్లిం, ఓబీసీ, అగ్రవర్ణాల అభ్యర్థులను బరిలోకి దింపింది.