Armstrong burial: పార్టీ కార్యాలయంలో ఆర్మ్‌స్ట్రాంగ్ భౌతికకాయాన్ని ఖననం చేసేందుకు హైకోర్టు నిరాకరణ
ABN , Publish Date - Jul 07 , 2024 | 04:45 PM
దారుణ హత్యకు గురైన బహుజన్ సమాజ్ పార్టీ తమిళనాడు విభాగం అధ్యక్షుడు కె.ఆర్మ్‌స్ట్రాంగ్ భౌతిక కాయాన్ని పార్టీ కార్యాలయం ఆవరణలో ఖననం చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు ఆదివారంనాడు తోసిపుచ్చింది. చైన్నైలోని పార్టీ కార్యాలయం వద్ద తన భర్త మృతదేహాన్ని ఖననం చేయాలని కోరుతూ ఆర్మ్‌స్ట్రాంగ్ భార్య కె.పోర్కోడి ఈ పిటిషన్ వేశారు.
చెన్నై: దారుణ హత్యకు గురైన బహుజన్ సమాజ్ పార్టీ (BJP) తమిళనాడు విభాగం అధ్యక్షుడు కె.ఆర్మ్‌స్ట్రాంగ్ (K.Armstrong) భౌతిక కాయాన్ని పార్టీ కార్యాలయం ఆవరణలో ఖననం చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు (Madras High court) ఆదివారంనాడు తోసిపుచ్చింది. చైన్నైలోని పార్టీ కార్యాలయం వద్ద తన భర్త మృతదేహాన్ని ఖననం చేయాలని కోరుతూ ఆర్మ్‌స్ట్రాంగ్ భార్య కె.పోర్కోడి ఈ పిటిషన్ వేశారు. పార్టీ ఆఫీసు రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నందున పిటిషనర్ అభ్యర్థనను ఆమోదించలేమని జస్టిస్ వి.భవానీ సుబ్బరాయన్ పేర్కొన్నారు. ప్రత్యామ్నాయంగా మరేదైనా లొకేషన్ అనుకుంటున్నారా అని పిటిషనర్‌ను ప్రశ్నించారు. తిరువళ్లూరు ప్రాంత్రాన్ని పిటిషనర్ సూచించడంతో పొత్తూరు పంచాయతీలోని ఒక ప్రైవేట్ భూమిలో ఖననం చేయడానికి కోర్టు అనుమతించింది. ఒక స్మారకాన్ని కూడా నిర్మించాలనుకుంటున్నట్టు ఆర్మ్‌స్ట్రాంగ్ కుటుంబం చెప్పడంతో తొలుత అంత్యక్రియలు ఎలాంటి అలజడలు లేకుండా పూర్తి చేయాలని, ఆ తర్వాత స్మారకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని జస్టిస్ భవానీ సుబ్బరాయన్ సూచించారు.
Chennai: నేనే దేవుణ్ణి... అభిషేకాలు చేయండి!
ఆర్మ్‌స్ట్రాంగ్ (47)ను గత శుక్రవారం సాయంత్రం ఆయన ఇంటికి సమీపంలో ఆరుగురు వ్యక్తులు అత్యంత పాశవికంగా నరికి చంపారు. ఈ హత్య తీవ్ర సంచలనం సృష్టించడంతో రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. ఎనిమిది మంది అనుమానితులను పోలీసులు ఇంతవరకూ అరెస్టు చేశారు. ఈ హత్య వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. కాగా, ఈ హత్యపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని బీఎస్‌పీ అధినేత్రి మాయావతి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Read Latest Telangana News and National News