Share News

Congress vs BSP: రాహుల్ రిజర్వేషన్ వ్యాఖ్యలపై మాయవతి ఫైర్..

ABN , Publish Date - Sep 11 , 2024 | 01:12 PM

అమెరికా పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీఎస్సీ అధినేత్రి మాయావతి రాహుల్ గాంధీపై ఫైర్ అయ్యారు. ఎక్స్‌లో రాహుల్ గాంధీ టార్గెట్‌‌గా..

Congress vs BSP: రాహుల్ రిజర్వేషన్ వ్యాఖ్యలపై మాయవతి ఫైర్..
Mayawati and Rahul Gandhi

అమెరికా పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీఎస్సీ అధినేత్రి మాయావతి రాహుల్ గాంధీపై ఫైర్ అయ్యారు. ఎక్స్‌లో రాహుల్ గాంధీ టార్గెట్‌‌గా వరుస ట్వీట్స్ చేశారు. కాంగ్రెస్‌తో పాటు సమాజ్‌వాదీ పార్టీని ఆమె లక్ష్యంగా చేసుకున్నారు. రాహుల్ గాంధీ నిజస్వరూరం బయటపడిందని మయావతి పేర్కొన్నారు. బీజేపీ కంటే ముందు 10 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ ఎస్సీ, ఎస్టీల పదోన్నతులకు సంబంధించిన రిజర్వేషన్ బిల్లును ఆమోదించలేదన్నారు. రాహుల్ గాంధీ రిజర్వేషన్లకు వ్యతిరేకం అనడానికి ఇదే నిదర్శనమని మాయవతి తెలిపారు. దేశంలో రిజర్వేషన్ల పరిమితిని 50 శాతానికి మించి పెంచుతామని కాంగ్రెస్ చెప్పడం భ్రమేనని మాయవతి ఆరోపించారు.


కాంగ్రెస్‌కు రిజర్వేషన్లు పెంచే ఉద్దేశం స్పష్టంగా ఉంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఈ పని కచ్చితంగా చేసి ఉండేదన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ రిజర్వేషన్ల అంశాన్ని ఉపయోగిస్తుందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయలేదన్నారు. అధికారంలో లేనప్పుడు ఓట్ల కోసం నిర్లక్ష్యానికి గురైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ మాట్లాడుతుందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఆ వర్గాల ప్రయోజనాలను గాలికొదిలేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకమనే విషయం రాహుల్ గాంధీ స్పష్టం చేశారన్నారు. ప్రజలు కాంగ్రెస్ కుట్రలను తెలుసుకోవాలని సూచించారు.

Amit Shah: రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై అమిత్ షా ట్వీట్..


కాంగ్రెస్ కుట్ర-మాయావతి

రాహుల్ ప్రకటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్రంగా స్పందించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను అంతం చేయాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి రిజర్వేషన్ వ్యతిరేక ఆలోచనతో ఉందన్నారు. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీతో సమాజ్‌వాదీ పార్టీ చేతులు కలిపిందంటూ అఖిలేష్‌ యాదవ్‌పై మమత బెనర్జీ విమర్శలు గుప్పించారు. కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలపై కాంగ్రెస్ కపట ప్రేమ చూపిస్తోందని ఆరోపించారు.

Trainee Doctor Father: సీఎం కోరినా బెంగాల్లో దుర్గాపూజను ఎవరూ జరుపుకోరన్న ట్రైనీ డాక్టర్ తండ్రి!


రాహుల్ ఏమన్నారంటే..

అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్‌లోని జార్ట్‌టౌన్ యూనివర్సిటీ విద్యార్థులతో ముఖాముఖిలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వేషన్లపై రాహుల్ గాంధీని ప్రశ్నించగా.. అందరికీ సమానమైన అవకాశాలు ఉన్నప్పుడు రిజర్వేషన్ల రద్దు గురించి ఆలోచిస్తామని రాహుల్ గాంధీ సమాధానం ఇచ్చారు. దేశంలో ఓబీసీలు, దళితులు, ఆదివాసీ, మైనార్టీల జనాభా 90 శాతం ఉండగా.. దేశంలోని మొదటి 200 మంది వ్యాపారులు, అత్యున్నత న్యాయస్థానాలు, మీడియాలో వీరి భాగస్వామ్యం దాదాపు శూన్యమని రాహుల్ గాంధీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో 78 మంది కార్యదర్శులు ఉంటే వీరిలో ఒకే ఒక్క గిరిజనుడు, ముగ్గురు దళితులు, ముగ్గురు ఓబీసీలు, ఒక్క మైనార్టీ మాత్రమే ఉన్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కులగణన ద్వారానే దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల స్థితిగతులు తెలుస్తాయని రాహుల్ గాంధీ తెలిపారు.


Digital Lottery: డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం.. రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Nationa News and Latest Telugu News

Updated Date - Sep 11 , 2024 | 01:12 PM