Home » BSP
ఆమె తెలంగాణలోని(Telangana) నల్గొండ(Nalgonda) ప్రాంతానికి చెందిన ఆడబిడ్డ.. కానీ, ఇప్పుడామె యూపీ ఎన్నికల్లో(Uttar Pradesh Elections) తలపడుతున్నారు. యూపీలోని జౌన్‌పుర్(Jaunpur) లోక్‌సభ స్థానం నుంచి బిఎస్పీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. తెలంగాణ మహిళ ఏంటి..
కేంద్రంలో అధికారంలోకి వస్తే పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌ను ప్రత్యేక రాష్ట్రం చేస్తామని బీఎస్సీ అధినేత్రి, మాజీ సీఎం మాయావతి(Mayawati) సంచలన ప్రకటన చేశారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. తొలి దశలో 102 లోక్‌సభ స్థానాలకు ఈరోజు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్ సహా 21 రాష్ట్రాల పరిధిలో 102 పార్లమెంట్ స్థానాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈశాన్య భారతంలోని ఆరు రాష్ట్రాల్లో 9 లోక్‌సభ స్థానాలతో పాటు.. తమిళనాడులోని 39 స్థానాలు, లక్షద్వీప్‌లోని ఒక లోక్‌సభ స్థానంలో మొదటి దశలో పోలింగ్ జరగనుంది.
తెలంగాణలో ఎంపీ ఎలక్షన్లు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణకు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రికి పీఠాన్ని అందించిన కారు జోరుకు గతేడాది జరిగిన ఎన్నికల్లో హస్తం బ్రేకులు వేసింది.
టీఎస్పీఎస్సీ ఛైర్మన్ గా తనను నియమిస్తారని వచ్చిన వదంతులపై ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ స్పందించారు. తనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) సంప్రదించిన మాట వాస్తవమేనని అన్నారు.
బహుజన్ సమాజ్ పార్టీ(BSP)కి గట్టి షాక్ తగిలింది. బీఎస్పీ రాష్ట్రాధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) పార్టీ అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కొన్ని రోజుల క్రితమే తాము బహుజన్ సమాజ్ పార్టీ (Bahujan Samaj Party) (బీఎస్పీ)తో కలిసి లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) పోటీ చేస్తామని బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) పేర్కొన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో (RS Praveen Kumar) చర్చలు కూడా జరిపారు. కానీ.. తాజాగా బీఆర్ఎస్కి షాకిస్తూ బీఎస్పీ చీఫ్ మాయావతి (BSP Chief Mayawati) సంచలన ప్రకటన చేశారు.
Telangana Politics: తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్(BRS) పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు బీఆర్ఎస్ను వీడగా.. ఇప్పుడు మరో కీలక నేత పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప(Koneru Konappa) పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో కోనప్పపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) పోటీ చేశారు.
రాజకీయంగా పొత్తులు సాధారణమైన విషయమని.. ఇండియా కూటమిలో బీఎస్పీ(BSP) లేదని తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి(Mallu Ravi) తెలిపారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయడానికి బీఎస్పీ సిద్ధంగా లేదని చెప్పారు. అందుకే బీఆర్ఎస్ను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలిశారని అన్నారు.త్వరలో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పారు.
BRS - BSP Alliance: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో(Telangana) కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్(BRS), బీఎస్పీ(BSP) మధ్య పొత్తు ఖరారైంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar).. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)తో భేటీ అయ్యారు. ఈ ఇద్దరు నేతలు పొత్తు విషయమై జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఈ సందర్భంగా కేసీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇద్దరూ మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నాయని కేసీఆర్ ప్రకటించారు.