Home » BSP
బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూడీ లోక్‌సభలో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల దుమారం తగ్గుముఖం పట్టలేదు. ఈ నేపథ్యంలో డానిష్ అలీని ఆయన నివాసంలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ శుక్రవారం కలుసుకున్నారు.
బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ డానిష్ అలీపై పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ రమేష్ బిధూడీపై ఆ పార్టీ చర్యలకు దిగింది. ఆయనకు షోకాజ్ నోటీసులు పంపింది. పార్లమెంటులో బిధూడీ చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.
సిద్దిపేట(Siddipet)లో దొరల గడిలా మీద బహుజన దండయాత్ర చేస్తున్నాం... రాబోయే రోజుల్లో కేసీఆర్ ఫాంహౌస్(KCR Farmhouse)లో నీలి జెండాలు పాతుతామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్( Praveen Kumar) హెచ్చరించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు పై ఓవైపు లోక్‌సభలో చర్చ జరుగుతుండగా, బిల్లు అమలులో విషయంలో జరిగే జాప్యంపై బహుజన్ సమాజ్ పార్టీ అ అధినేత్రి మాయావతి అనుమానాలు వ్యక్తం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మహిళలను ఆకట్టుకునేందుకే కేంద్రం ఈ బిల్లు తెచ్చినట్టు ఆమె ఆరోపించారు.
ఉత్తర్ ప్రదేశ్(Uttarpradesh) మాజీ సీఎం, బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి పార్లమెంటు(Parliament)లో కేంద్రం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్(R. S. Praveen Kumar) వ్యాఖ్యానించారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కానీ తమ పార్టీ ఎలాంటి కూటమిలోను చేరదని, ఒంటిరిగానే ఎన్నికల బరిలోకి దిగుతుందని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేతో పొత్తు పెట్టుకునే అవకాశాలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు.
వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ) సారథ్యంలోని బహుజన్ సమాజ్ పార్టీ నిర్ణయించింది. ఈ ఏడాది చివర్లో పలు రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని నెలరోజుల క్రితం బీఎస్పీ ప్రకటించింది.
దొరల పాలనతో బహుజనులకు తీరని నష్టం జరుగుతోందని తెలంగాణ బహుజన సమాజ్ వాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ (Praveen Kumar)అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం భూముల వేలం(Auction of land by Govt) పేరుతో చీకటి దందా చేస్తోందని ఈ అంశంపై బీఎస్పీ దశలవారీగా ఉద్యమిస్తుందని బీఎస్సీ(BSP) నేత RS ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) అన్నారు.