RS Praveen Kumar: భూముల వేలం పేరుతో కేసీఆర్ చీకటి దందా

ABN , First Publish Date - 2023-08-08T17:55:59+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం భూముల వేలం(Auction of land by Govt) పేరుతో చీకటి దందా చేస్తోందని ఈ అంశంపై బీఎస్పీ దశలవారీగా ఉద్యమిస్తుందని బీఎస్సీ(BSP) నేత RS ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) అన్నారు.

RS Praveen Kumar: భూముల వేలం పేరుతో కేసీఆర్ చీకటి దందా

వరంగల్: తెలంగాణ ప్రభుత్వం భూముల వేలం(Auction of land by Govt) పేరుతో చీకటి దందా చేస్తోందని ఈ అంశంపై బీఎస్పీ దశలవారీగా ఉద్యమిస్తుందని బీఎస్సీ(BSP) నేత RS ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) అన్నారు. మంగళవారం మీడియాతో RS ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వమే రియల్ ఎస్టేట్(
Real estate) దందాలను ప్రోత్సహిస్తోందని చెప్పారు.బహుజన రాజ్యం వచ్చాక ప్రభుత్వం వేలం వేసిన ప్రతీ గజాన్ని వెనక్కి తీసుకుంటామన్నారు.ప్రైవేట్ యూనివర్సిటీ(Private University)ల దగ్గర ముడుపులు తీసుకుని ప్రభుత్వ యూనివర్సిటీ(Government University)లను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.


తెలంగాణ సాంస్కృతిక సారధి ఏర్పాటు చేసి కళాకారుల నోరు మూశారన్నారు. 500మందికి కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నారని చెప్పారు. గద్దర్ మరణంపై ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) అసెంబ్లీలో తీర్మానం చేయకపోవడం విచారకరమన్నారు. గద్దర్ అంతిమయాత్రలో పోలీస్ బందోబస్తు సరిగా ఏర్పాటు చేయలేదని.. దీంతో తోపులాట జరిగి ఓ వ్యక్తి మృతిచెందారని తెలిపారు.BSP అధికారంలోకి వస్తే గద్దర్ ఫ్రీడం యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని RS ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

Updated Date - 2023-08-08T17:56:16+05:30 IST