Mayavathi on Womens Reservations: మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతించిన మాయావతి.. కానీ ఓ కండిషన్
ABN , First Publish Date - 2023-09-19T17:51:09+05:30 IST
ఉత్తర్ ప్రదేశ్(Uttarpradesh) మాజీ సీఎం, బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి పార్లమెంటు(Parliament)లో కేంద్రం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
లక్నో: ఉత్తర్ ప్రదేశ్(Uttarpradesh) మాజీ సీఎం, బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి పార్లమెంటు(Parliament)లో కేంద్రం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అయితే కేంద్రానికి పలు డిమాండ్లు వినిపించారు. ఓబీసీ, దళిత మహిళల కోసం ప్రస్తుతం అందిస్తున్న రిజర్వేషన్ల(Womans Reservations) కోటాలో మరింత ప్రాధాన్యత కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.
“మహిళా రిజర్వేషన్‌ను 33%కి బదులు 50%గా ఉండాలి. పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు అందితేనే దేశం పురోగాభివృద్ధి సాధిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ప్రాధాన్యత కల్పించాలి" మాయావతి కోరారు. బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress)లు దళితులు, వెనకబడిన కులాలను ఇంకా అట్టడుగున చూడాలనుకుంటున్నాయని ఆమె ఆరోపించారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ పార్టీ మద్దతు ప్రకటిస్తుందని స్పష్టం చేశారు. బిల్లు ఆమోదం పారదర్శకంగా జరగాలన్నది తన ఆకాంక్ష అని ఇందులో ఎలాంటి రాజకీయాలు చేయవద్దని కోరారు.