Home » Budameru Rivulet
Andhrapradesh: గత వారం రోజులుగా సింగ్‌నగర్ వాసులను అవస్థలకు గురిచేసిన బుడమేరు వరద కాస్త తగ్గుముఖం పట్టింది. భారీ వర్షాలతో బుడమేరు ఉగ్రరూపం దాల్చడంతో విజయవాడలోని అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వరదలతో బెజవాడ వాసులు స్తంభించిపోయారు. భారీ వరదలతో వేలాది మంది తమ తమ నివాసాలను వదలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోయారు.
Andhrapradesh: బుడమేరు గండ్లు పూడ్చి వేత పనులు యుద్ధప్రాతిపదిక సాగుతున్నాయి. రాత్రి వేల కూడా ఫ్లడ్ లైట్ల వెలుతురులో పనులు కొనసాగాయి. బుడమేరు గండ్ల పూడ్చివేత పనులను మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... బుడమేరు మూడో గండి 90 శాతం పూర్తి అయ్యాయని తెలిపారు.
బుడమేరు నది జలవిలయం సృష్టించింది. 20 నిమిషాల్లోనే అంతా అయిపోయిందని ఓ మహిళ కన్నీటి పర్యంతం అయ్యింది. ఫ్రీజ్, వాషింగ్ మిషన్లు, టీవీ పాడయిపోయాయని వివరించారు. బుడమేరు నది ప్రవాహంతో ఒక్కొక్కరికి రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లింది. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో వరదలు రాలేవని వాపోతున్నారు.
Andhrapradesh: బుడమేరు గండి పడిన ప్రాంతంలో కుండపోతగా వర్షం కురుస్తోంది. అయితే వర్షం కురుస్తున్నప్పటికీ గండి పూడ్చివేత పనులు కొనసాగిస్తున్నారు అధికారులు. గండి పూడుస్తూనే మరోవైపు నీటిని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేపట్టారు. మచిలీపట్నం నుంచి వచ్చిన బోట్లను బుడమేరు గండి పడిన ప్రాంతానికి అధికారులు తరలించారు.
Andhrapradesh: బుడమేరులో వరద ఉధృతి కొనసాగుతోంది. ఉదయం నుంచి రెండు మేర పెరిగిన నీటి ప్రవాహం మధ్యాహ్నానికి మరో రెండు అడుగులు పెరిగింది. దీంతో దాదాపు ఆరు కిలోమీటర్ల మేర రోడ్లు మునిగిపోయాయి. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీటితో నందివాడ మండలంలోని 12 గ్రామాలు జలదిగ్బంధంలో మునిగిపోయాయి.
వారం రోజులపాటు కురిసిన భారీ వర్షాలకు బుడమేరుకు గండి పడి విధ్వంసం జరిగిన సంగతి తెలిసిందే. అయితే అప్రమత్తమైన ఏపీ అధికార యంత్రాంగం గండి పూడ్చివేత పనులు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఆర్మీ జవాన్లతో పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టింది.
బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టినట్లు ఏపీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. మరో 48గంటల్లో పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
Andhrapradesh: భారీ వర్షాలతో మహోగ్రరూపం దాల్చిన బుడమేరు వరద నిన్న కాస్త తగ్గినట్టు అనిపించగా ఈరోజు మరోసారి వరద ఉధృతి పెరిగింది. రెండు అడుగుల మేర నీటిమట్టం పెరిగింది. వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో నిన్న ప్రజలు తమ నివాసాల్లోకి వెళ్లి బురదను శుభ్రం చేస్తున్నారు.
బెజవాడ వరదపై విపక్షనేత వైఎస్ జగన్‌వి బురదజల్లుడు రాజకీయమే అని స్పష్టమైంది. బుడమేరు సృష్టించిన విధ్వంసానికి ఆయన అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలే కారణమని తేలిపోయింది. కేవలం టీడీపీ అధినేత చంద్రబాబుకు పేరొస్తుందన్న దురుద్దేశంతో జల వనరుల శాఖ చేపట్టిన 198 అభివృద్ధి పనులను ఒక్క కలంపోటుతో జగన్ రద్దు చేశారు...