Share News

పెరిగిన బుడమేరు వరద.. భయాందోళనలో బెజవాడ వాసులు

ABN , Publish Date - Sep 06 , 2024 | 09:32 AM

Andhrapradesh: భారీ వర్షాలతో మహోగ్రరూపం దాల్చిన బుడమేరు వరద నిన్న కాస్త తగ్గినట్టు అనిపించగా ఈరోజు మరోసారి వరద ఉధృతి పెరిగింది. రెండు అడుగుల మేర నీటిమట్టం పెరిగింది. వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో నిన్న ప్రజలు తమ నివాసాల్లోకి వెళ్లి బురదను శుభ్రం చేస్తున్నారు.

పెరిగిన బుడమేరు వరద.. భయాందోళనలో బెజవాడ వాసులు
Flood increased in Budameru

విజయవాడ, సెప్టెంబర్ 6: భారీ వర్షాలతో (Heavy Rains) మహోగ్రరూపం దాల్చిన బుడమేరు (Budameru) వరద నిన్న కాస్త తగ్గినట్టు అనిపించగా ఈరోజు మరోసారి వరద ఉధృతి పెరిగింది. రెండు అడుగుల మేర నీటిమట్టం పెరిగింది. వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో నిన్న ప్రజలు తమ నివాసాల్లోకి వెళ్లి బురదను శుభ్రం చేసుకున్నారు. అయితే ఈరోజు మళ్లీ వరద నీరు ఇంట్లోకి రావడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సాయంత్రానికి తగ్గుముఖం పడుతుందని అధికారులు చెబుతున్నారు.

Vijayawada Floods: ముంచింది జగనే!


మరోవైపు ఎడతెరపిలేని వర్షాలు బెజవాడ వాసులను భయబ్రాంతులకు గురి చేశాయి. వర్షాలతో ప్రజలు ఇళ్లకే పరిమతమయ్యారు. ముంపు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అయితే వారం రోజుల అనంతరం విజయవాడ వాసులకు సూర్య భగవానుడు ఈరోజు దర్శనమిచ్చారు. గడిచిన వారం రోజులుగా వర్షాలు, ముసురు పట్టిన కారణంగా సూర్య భగవానుడు కనపడని పరిస్థితి. అయితే ఈరోజు ఉదయమే సూర్యుడు కనిపించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

Rain Effect: వరద బీభత్సానికి దెబ్బతిన్న వేలాది కార్లు.. గగ్గోలు పెడుతున్న వాహనదారులు..


గండ్ల పూడికలో కీలక ఘట్టం

ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి దగ్గర బుడమేరుకు పడిన గండ్ల పూడిక పనుల్లో కీలక ఘట్టానికి చేరుకున్నారు. విజయవాడ సింగ్‌నగర్‌ను ముంపుకు కారణమైన మూడు గండ్లలో రెండు గండ్లు పూడ్చి కీలకమైన మూడో గండికి చేరుకునేలా యుద్ధ ప్రాతిపాదికన పనులు సాగుతున్నాయి. గత ఐదు రోజుల నుంచి మంత్రి నిమ్మల రామానాయుడు.. అక్కడే ఉండి ఏజెన్సీలతో పనులు చేయిస్తూ ఎప్పటికప్పుడు వర్క్ ప్రోగ్రెస్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లకు అప్డేట్ చేస్తున్నారు. బుడమేరు మూడో గండిని అధికార యంత్రాంగం పూడుస్తోంది. అక్కడే ఉండి పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు మూడో గండి కూడా పూడ్చే వరకు అక్కడ నుంచి వెళ్ళే ప్రసక్తి లేదని చెబుతున్నారు. మూడో గండిని ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు సాయంత్రానికల్లా పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో రామానాయుడు పనులు చేయిస్తున్నారు. గండి పడిన ప్రాంతానికి ఆర్మీ చేరుకుంది. ఆర్మీ అధికారులు సహాయ సహకారాలతో పనుల్లో వేగం పెంచారు.


ఇవి కూడా చదవండి...

Shivraj Singh Chauhan: వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర మంత్రి

AP News: నేటి నుంచి వరద ప్రాంతాల్లో బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణి

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 06 , 2024 | 09:45 AM