Share News

Budameru: కుండపోత వర్షం.. గండి పడిన ప్రాంతానికి పెద్దఎత్తున మిలటరీ అధికారులు

ABN , Publish Date - Sep 06 , 2024 | 03:38 PM

Andhrapradesh: బుడమేరు గండి పడిన ప్రాంతంలో కుండపోతగా వర్షం కురుస్తోంది. అయితే వర్షం కురుస్తున్నప్పటికీ గండి పూడ్చివేత పనులు కొనసాగిస్తున్నారు అధికారులు. గండి పూడుస్తూనే మరోవైపు నీటిని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేపట్టారు. మచిలీపట్నం నుంచి వచ్చిన బోట్లను బుడమేరు గండి పడిన ప్రాంతానికి అధికారులు తరలించారు.

Budameru: కుండపోత వర్షం.. గండి పడిన ప్రాంతానికి పెద్దఎత్తున మిలటరీ అధికారులు
Budameru Flood

అమరావతి, సెప్టెంబర్ 6: బుడమేరు (Budameru) గండి పడిన ప్రాంతంలో కుండపోతగా వర్షం (Heavy Rain) కురుస్తోంది. అయితే వర్షం కురుస్తున్నప్పటికీ గండి పూడ్చివేత పనులు కొనసాగిస్తున్నారు అధికారులు. గండి పూడుస్తూనే మరోవైపు నీటిని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేపట్టారు. మచిలీపట్నం నుంచి వచ్చిన బోట్లను బుడమేరు గండి పడిన ప్రాంతానికి అధికారులు తరలించారు. సరుకు బాదులు నిలబెట్టి నీటిని తాత్కాలికంగా రేకులు ద్వారా వరద నీటికి అడ్డుకట్ట వేయాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు గండి పడిన ప్రాంతానికి పెద్ద స్థాయిలో మిలిటరీ అధికారులు చేరుకున్నారు.

Raj Tarun: రాజ్ తరుణ్, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్..


6వ మద్రాస్ మిలిటరీ బెటాలియన్ నుంచి 120 మంది అధికారులు, జవాన్లు గండి పడిన ప్రాంతానికి వచ్చారు. మరికొద్ది సేపట్లో మిలిటరీ ఆధ్వర్యంలో గండి పూడ్చే కార్యక్రమం ప్రారంభం కానుంది. తాత్కాలికంగా రాడ్డులతో వంతెనల్లాగా నిర్మాణం చేసి దాంట్లో రాళ్లు వేసి పూడుస్తామని మిలిటరీ అధికారులు చెబుతున్నారు. మరికొద్దిసేపట్లో బుడమేరు గండి పడిన ప్రాంతానికి మిలిటరీ అధికారుల సామాగ్రి చేరుకోనుంది.


బుడమేరు వరద ఉధృతి...

మరోవైపు బుడమేరులో వరద ఉధృతి కొనసాగుతోంది. ఉదయం నుంచి రెండు మేర పెరిగిన నీటి ప్రవాహం మధ్యాహ్నానికి మరో రెండు అడుగులు పెరిగింది. దీంతో దాదాపు ఆరు కిలోమీటర్ల మేర రోడ్లు మునిగిపోయాయి. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీటితో నందివాడ మండలంలోని 12 గ్రామాలు జలదిగ్బంధంలో మునిగిపోయాయి. బుడమేరు వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో నిన్న (గురువారం) ప్రజలు తమ నివాసాల్లోకి వెళ్లి బురదను శుభ్రం చేస్తున్నారు. అయితే ఈరోజు మళ్లీ వరద నీరు ఇంట్లోకి రావడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

Rammohannaidu: జగన్ వల్ల రాష్ట్రానికి ప్రమాదం.. రామ్మోహన్ సంచలన కామెంట్స్

YS Jagan: వైఎస్ జగన్‌కు ఊహించని షాక్.. పాస్‌పోర్ట్ రద్దు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 06 , 2024 | 03:41 PM