Home » Buddha Venkanna
‘అవంతి శ్రీనివాస్... నీలాంటి ఊసరవెల్లులు మాకేం సమయం ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న అన్నారు.
వైఎస్పార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యదు చేసినట్లు తెలుగుదేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న తెలిపారు. విజయసాయికి సిగ్గు శరం ఏమాత్రం ఉన్నా.. మనిషిగా మాట్లాడాలని అన్నారు.
వైసీపీ ప్రభుత్వ సహకారంతో ఆర్జీవీ ఇష్టం వచ్చినట్టు వాగాడు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్‌ను కించపరిచేలా సినిమాలు తీశాడు. తన ట్విట్టర్లో మార్ఫింగ్ ఫొటోలు పెట్టి పైశాచిక ఆనందం పొందాడు. ఇప్పుడు కేసులకు భయపడి ఎక్కడో దాక్కున్నాడు.
రాంగోపాల్ వర్మకు దమ్ముంటే.. ధైర్యంగా నిలబడాలని.. అప్పుడు చేసింది కరెక్టు అని చెప్పాలని.. ఆనాడు రెచ్చిపోయి.. ఇప్పుడు దాక్కున్న కొడాలి నాని, వంశీ, అవినాష్‌ల గురించి సినిమా తీయాలని బుద్దా వెంకన్న డిమండ్ చేశారు. వర్మ సినిమాలకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిందని.. ఇప్పుడు కేసులు పెట్టడం ఏమిటని జగన్ అంటున్నారని.. జగన్‌కు సిగ్గు ఉందా.. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఈ సినిమాల గురించి మాట్లాడతారా.. అంటూమండిపడ్డారు.
అదానీ నుంచి రూ.1,750 కోట్ల ముడుపులు తీసుకున్నట్లు అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో.. జగన్ విచారణకు వెళ్తే ఇక జీవితాంతం ఏపీకి తిరిగి రాలేడని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న అన్నారు.
వైసీపీ అధినేత జగన్‌కు దమ్ముంటే ఇప్పుడు అమెరికా వెళ్లమనండి. ఇక జీవితాంతం ఆయన తిరిగి ఏపీకి రాలేరని తెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో అడ్డగోలుగా వాగిన వారంతా జైలుకు వెళ్లాల్సిందే.. శిక్ష అనుభవించాల్సిందేనని బుద్దా వెంకన్న మాస్ వార్నింగ్ ఇచ్చారు.
సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆ లేఖపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తనదైన శైలిలో స్పందించారు. ఆ క్రమంలో ముద్రగడకు బుద్దా బహిరంగ లేఖ రాశారు.
Andhrapradesh: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విజయసాయిని చిత్తకార్తి కుక్కతో పోల్చుతూ మండిపడ్డారు. కూటమిలో చిచ్చు పెట్టాలని శకునిలా తాపత్రయపడుతున్నారంటూ ఫైర్ అయ్యారు.
Andhrapradesh: ఇంటింటికీ ఆహారం, మంచినీరు, అందించారన్నారు. ప్రజలు అందరూ చంద్రబాబు వల్లే నేడు ఈ వరదల నుంచి బయట పడ్డామని గొప్పగా చెప్పారని.. ఇటువంటి వాటిని చూసి వైసీపీ నేతలుభరించలేకపోతున్నారని అన్నారు. వరదలను అడ్డం పెట్టుకుని దోపిడీ చేశారని అనడానికి సిగ్గు ఉండాలి అంటూ బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhrapradesh: తిరుమల వెళతానన్న జగన్.. నిన్న సాయంత్రం తనకు అనుమతి ఇవ్వలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని బుద్దా వెంకన్న అన్నారు. ‘‘మనం అనుకుంటే కాదు... ఆ స్వామి అనుగ్రహిస్తేనే మనం వెళ్లగలం.. వెంకన్న స్వామి అనుమతి లేదు కాబట్టే జగన్ వెళ్లలేకపోయారు’’ అని అన్నారు.