Buddha Venkanna.. అంబటి ట్వీట్‌కు బుద్దా వెంకన్న కౌంటర్
ABN , Publish Date - Feb 07 , 2025 | 11:27 AM
అమరావతి: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్‌కు తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కౌంటర్ ట్వీట్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 11 సీట్లు కూడా రావని అన్నారు.

అమరావతి: వైఎస్సార్‌సీపీ నేత (YSRCP Leader), మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ex Minister Ambati Rambabu) ట్వీట్ (Tweet)కు తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న (Buddha Venkanna) కౌంటర్ ట్వీట్ (Counter Tweet) ఇచ్చారు. ‘‘అయ్యా అంబటి.. 8, 9 స్థానాల్లో వచ్చిన మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గార్లు.. 1, 2 స్థానాల్లోకి రావడానికి కృషి చేస్తున్నారు.. అలాగే 11 స్థానాల్లో ఉన్న మీ వైఎస్ జగన్ రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో ఒక్క స్థానంలోకి రావడానికి మరింత కృషి చేస్తున్నారు’’ అని బుద్దా వెంకన్న ఎద్దేవా చేస్తూ.. కౌంటర్ ఇచ్చారు.
ఈ వార్త కూడా చదవండి..
అంబటి ట్వీట్..
గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ పాలకవర్గాలను టీడీపీ లాక్కుంటోందని ఆరోపించారు. గుంటూరులో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు కుట్రలతో సాధించారని విమర్శించారు. గుంటూరులో 57 డివిజన్లలో వైసీపీకి 46 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ, టీడీపీ స్టాండింగ్ కమిటీని చేజిక్కించుకుందని ఆయన ఆరోపించారు. ‘మా కార్పొరేటర్లను లాక్కొని, కొందరితో క్రాస్ ఓటింగ్ చేయించారు. క్రాస్ ఓటింగ్ చేసినవారికి నైతిక విలువలు లేవు. బాహాటంగా పార్టీకి వ్యతిరేకంగా వెళ్లినవారు కన్నా లోపలుండి వెన్నుపోటు పొడిచే వారు మరింత ప్రమాదకరం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి వ్యాఖ్యాలపై స్పందించిన బుద్దా వెంకన్న ఈ మేరకు కౌంటర్ ఇచ్చారు.
కాగా మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి మానసిక వైద్యుల వద్ద పరీక్షలు చేయించాలని బుద్దా వెంకన్న సూచించారు. తన కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ పాలనను అంగీకరించకనే ప్రజలు ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం చేసి, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మూలన కూర్చోబెట్టారన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకుని సంతోషంగా ఉన్నారన్నారు. ఏడాది కూడా కాకుండానే తనకే ప్రజలు అధికారం కట్టబెడతారని, మరో 30 సంవత్సరాలు సీఎంగా ఉంటాననే భ్రమలుపోతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ మాటలకు వైసీపీలోని నాయకులే విస్తుపోతున్నారన్నారు. జగన్ హయాంలో రాష్ట్రంలో ఎక్కడ పట్టినా కబ్జాలేనన్నారు. దమ్ముంటే జగన్ అసెంబ్లీకి వెళ్లి ప్రజల పక్షాన మాట్లాడాలన్నారు. జగన్ 2.0కు 2029 ఎన్నికల్లో ఇప్పుడు వచ్చిన 11 సీట్లు కూడా రావని బుద్దా వెంకన్న తేల్చిచెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..
పోలీస్ విచారణకు రాంగోపాల్ వర్మ
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News