Buddha Venkanna: జగన్ చాప్టర్ క్లోజ్.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Feb 15 , 2025 | 11:00 AM
Buddha Venkanna: మాజీ సీఎం జగన్‌పై మరోసారి విరుచుకుపడ్డారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. ప్రతిపక్ష హోదా ఇవ్వద్దని ప్రజలే డిసైడ్ చేశారు కాబట్టే 11 సీట్లు మాత్రమే కట్టబెట్టారని... అయినా తనకు ప్రతిపక్ష హోదా కావాలంటూ జగన్ మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.

విజయవాడ, ఫిబ్రవరి 15: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (Former CM YS Jaganmohan Reddy) టీడీపీ నేత బుద్దా వెంకన్న (TDP Leader Buddha Venkanna)ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలో పిల్ల సైకో వంశీ బూతులు, చేష్టలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. వంశీ అరెస్టుతో ఇంతకాలానికి తగిన శిక్ష పడిందని ప్రజలంతా అభిప్రాయపడ్డారన్నారు. ఎక్స్‌లో పెద్ద సైకో ఈ పిల్ల సైకోకు మద్దతుగా పోస్ట్ పెట్టారని మండిపడ్డారు. వంశీ, కొడాలి నాని బూతుల వల్ల కూడా నష్టం జరిగిందని వైసీపీ నేతలే చెబుతున్నారని.. ఆరోజు వారందరితో బండ బూతులు తిట్టించిన జగన్ .. ఇప్పుడు నీతి సూత్రాలు చెబుతున్నారని వ్యాఖ్యలు చేశారు. వారందరినీ ప్రోత్సహించాడు కాబట్టే జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారన్నారు.
నీలా ఆడవాళ్లను తిట్టించము...
‘‘నీకు 11 సీట్లు వచ్చాయంటే.. ప్రతిపక్ష హోదా ఇవ్వద్దని ప్రజలే డిసైడ్ చేశారు. అయినా నాకు ప్రతిపక్ష హోదా కావాలంటూ జగన్ మాట్లాడుతున్నాడు. కొడాలి నాని, వల్లభనేని వంశీలు సిగ్గూ శరం లేకుండా మాట్లాడినా జగన్ భుజం తట్టి ప్రోత్సహించాడు. వాళ్లిద్దరూ టీడీపీలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడలేదే. అలా ఎవరైనా వాగితే.. మా అధినేత చంద్రబాబు వెంటనే సస్పెండ్ చేసేవారు. నీలాగా .. నీచమైన రాజకీయాలు చేసి ఇంట్లో ఆడవాళ్లను తిట్టించే సంస్కృతి టీడీపీకి లేదు’’ అని అన్నారు.
BMW Car: జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద కారు బీభత్సం
తల్లిని, చెల్లిని వదలలేదు...
గత ఐదేళ్లల్లో మీరు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావన్నారు. టీడీపీకి జై కొట్టిన కార్యకర్తలను కూడా అరెస్టు చేయించారు, చంపించారని ఆగ్రహించారు. అయినా ప్రజల కోసం, పార్టీ కోసం టీడీపీ కార్యకర్తలు పోరాటం చేశారన్నారు. ‘‘మేము దమ్ముగా ధైర్యంగా మాట్లాడి.. నీ అవినీతిని ప్రశ్నించాం. చివరకు నీ తల్లిని, చెల్లిని కూడా.. నీచంగా మాట్లాడించిన దుర్మార్గుడివి నువ్వు. నీలాగా ఇంట్లో ఆడవాళ్లను తిట్టించి పైశాచిక ఆనందం పొందేవారు రాజకీయాల్లో ఉండేందుకు కనీస అర్హత కూడా లేదు. నీ పిల్ల సైకోని అరెస్టు చేస్తే.. నువ్వు ఎక్స్‌లో పోస్టు పెట్టావంటే.. నువ్వు ఎంత నీచుడివో అర్దం అవుతుంది. ఎన్టీఆర్ కుమార్తెగా, చంద్రబాబు సతీమణిగా భువనేశ్వరమ్మకు సమాజంలో గుర్తింపు, గౌరవం ఉంది. తండ్రి, భర్త సీఎంలుగా ఉన్నప్పటికీ.. తనకంటూ సొంతంగా పారిశ్రామిక వేత్తగా ఎదిగి వేలాది మందికి ఉపాధి కల్పించారు. అటువంటి తల్లిని అవమానిస్తే, నీచంగా మాట్లాడితే.. నవ్వుకుంటూ సైకో లాగా ఆనందాన్ని పొందుతావా. తల్లిని, చెల్లినే గౌరవించని జగన్‌కు.. ఇంతకన్నా సంస్కారం ఉంటుందా’’ అంటూ విమర్శలు గుప్పించారు.
వారంతా ఊచలు లెక్కించాల్సిందే..
జగన్ అధికారాన్ని చూసి విర్రవీగిన వారంతా తప్పకుండా ఊచలు లెక్కిస్తారని హెచ్చరించారు. నారా లోకేష్ తన పాదయాత్రలోనే రెడ్ బుక్ ద్వారా చెప్పారని.. నాడు నోటి దూల తీర్చుకున్న వారికి నేడు చట్టపరంగా దూల తీరుస్తామని ప్రకటించారన్నారు. ఇప్పుడు చేసిన తప్పులకు అరెస్టులు చేస్తుంటే గగ్గోలు పెడుతున్నారన్నారన్నారు. కళ్లు మూసుకుపోయి, అధికార మదంతో మదమెక్కి వాగారని విరుచుకుపడ్డారు. కొడాలి నాని, వంశీ, అంబటి రాంబాబు, అనిల్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాసరావు, రోజా వంటి వారితో ట్రైనింగ్ ఇచ్చి జగనే మాట్లాడించారని ఆరోపించారు. జగనే స్వయంగా తనకు 40 నిమిషాలు ట్రైనింగ్ ఇచ్చి తిట్టించాడని విజయసాయిరెడ్డి చెప్పారన్నారు. రాజకీయంగా ఎదుర్కునే దమ్ము లేని జగన్ .. ఇంట్లో ఆడవాళ్లను తిట్టించారని మండిపడ్డారు.
మనిషిగా బతకడం నేర్చుకో...
‘‘అదే మా అధినేత చంద్రబాబు .. మమ్మలను నోరు జారితే ఊరుకోరు. వంశీ, కొడాలి నానితో మాట్లాడించిన జగన్‌కు రాజకీయంగా చరిత్ర ముగిసింది. ప్రజలు ఛీ కొట్టి 11 సీట్లు ఇచ్చారు. ఈసారి అవి కూడా ఇవ్వరు. రాజకీయంగా జగన్ చాప్టర్ క్లోజ్.. ఇప్పుడు అయినా మనిషిగా బతకడం నేర్చుకోవాలని హితవుపలికారు. జగన్ మళ్లీ అధికారంలోకి రావడం జరగదని.. ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయారని టీడీపీ నేత బుద్దా వెంకన్న పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్.. అసలు కారణమిదే..
రైతన్నకు అండగా.. ప్రధాన మంత్రి ఫసల్ బీమా
Read Latest AP News And Telugu News