Share News

Buddha Venkanna: వాళ్ల పాపం పండింది.. చర్యలు తప్పవు

ABN , Publish Date - Feb 19 , 2025 | 11:30 AM

Buddha Venkanna: విజయవాడలో పోలీసులపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘నీ ప్రభుత్వంలో అదే పోలీసులను వాడుకుని అక్రమ కేసులు మా వాళ్లపై పెట్టించారు. ఇప్పుడు అదే పోలీసులు సంగతి‌చూస్తా అని జగన్ బెదిరిస్తున్నాడు. వంశీని పరామర్శించిన జగన్ చరిత్ర హీనుడిగా మిగిలాడు’’ అంటూ విరుచుకుపడ్డారు.

Buddha Venkanna: వాళ్ల పాపం పండింది.. చర్యలు తప్పవు
TDP Leader Buddha Venkanna

విజయవాడ, ఫిబ్రవరి 19: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (Former CM YS Jagan Mohan Reddy) మరోసారి విరుచుకుపడ్డారు టీడీపీ నేత బుద్దా వెంకన్న (TDP Leader Buddha Venkanna). బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పిల్ల సైకో వంశీని పరామర్శించేందుకు పెద్ద సైకో వచ్చాడని విమర్శించారు. ఒక పధకం ప్రకారం కిరాయి మూకలను తీసుకుని విజయవాడ వచ్చారని.. పోలీసులు ముందే పసి‌గట్టి ఎక్కడికక్కడ నివారించారని తెలిపారు. పోలీసులు ఎక్కడున్నా వారి బట్టలు ఊడదిస్తానని చేసిన వ్యాఖ్యలు జగన్ నైజాన్ని మరోసారి బయట పెట్టాయన్నారు.


నానికి ఎందుకంత భయం...

‘‘నీ పిల్లలను‌ కలవాలన్నా కూడా అదే పోలీసులు అనుమతి నీకు ఉండాలి జగన్. వంశీని కలిసిన తరువాత జగన్ పని అయిపోయింది. నందిగం సురేష్‌ను ఇలా ఎందుకు కలవలేదు. కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్, దేవినేని అవినాష్ అంటే చంద్రబాబుకు అసూయ అంట. జగన్ వ్యాఖ్యలు చూసి వంశీ సతీమణి అక్కడే నవ్వుకుంటున్నారు.. వీడియో చూసుకో. అధికారంలో ఉండగా తొడలు కొట్టి, మీసం తిప్పి, జబ్బలు చరిచారు. కొడాలి నాని నిన్న జగన్‌తో వచ్చి .. మళ్లీ అప్పుడే వెళ్లిపోయాడు. సవాళ్లు చేసిన కొడాలి నానికి ఎందుకంత భయం’’ అని ప్రశ్నించారు.

ఢిల్లీ సీఎం ప్రమాణ కార్యక్రమానికి చంద్రబాబు, పవన్..


అల్లర్లు చేసేందుకే..

గుడివాడలో కొత్త అభ్యర్థి చేతిలో కొడాలి నానీ ఓడిపోయినా సిగ్గు రాలేదా అని మండిపడ్డారు. వంశీ, నానీలను నిజంగా లోపల వేయాలంటే నెల్లోనే జైలుకు పంపే వాళ్లమన్నారు. విజయవాడలో బీభత్సం సృష్టించాలని జగన్ ఆలోచన‌ చేశారని దుయ్యబట్టారు. ‘‘నీ ప్రభుత్వంలో అదే పోలీసులను వాడుకుని అక్రమ కేసులు మా వాళ్లపై పెట్టించారు. ఇప్పుడు అదే పోలీసుల సంగతి‌ చూస్తా అని జగన్ బెదిరిస్తున్నాడు. వంశీని పరామర్శించిన జగన్ చరిత్రహీనుడిగా మిగిలాడు. జగన్ ఒక్కడే జైలుకు వెళ్లి వంశీతో మాట్లాడవచ్చు కదా. అరాచకాలు, అల్లర్లు చేసేందుకే కార్యకర్తలను వెంటేసుకుని జగన్ వచ్చాడు. చంద్రబాబుపై విమర్శలు చేసిన జగన్‌కు వంశీ వ్యాఖ్యలు గుర్తు రాలేదా. వంశీ... చంద్రబాబు, భువనమ్మలను తిడితే జగన్ పైశాచిక ఆనందం పొందాడు. వంశీ రౌడీయిజం, బూతులు గురించి జగన్‌కు తెలియదా. వంశీ, కొడాలి నాని, అవినాష్‌ల దాడులు, బూతులను జగన్ సమర్ధించాడు’’ అని మండిపడ్డారు.


జగన్ కుట్ర...

ఈసారి పులివెందులలో కూడా జగన్‌ ఓటమి ఖాయమని స్పష్టం చేశారు. వంశీ, నాని వ్యాఖ్యల‌ వల్లే వైసీపీకి నష్టం జరిగిందని ఆ పార్టీ వాళ్లే అంటున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ‌లా అండర్ కంట్రోల్‌లో ఉందన్నారు. ఇప్పుడు ఇది చెడగొట్టడమే లక్ష్యంతో జగన్ కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పక్కన ఉన్న వారందరిపైనా కేసులు ఉన్నాయన్నారు. జగన్.. ఇక నీ ఆటలు‌ సాగవు.. ప్రజలే నీ సంగతి తేలుస్తారని హెచ్చరించారు. ఇప్పుడైనా ప్రజలకు మేలు చేసేలా పని చేయాలని హితవుపలికారు. వంశీ, కొడాలి నానీల నోటి‌ దూల వల్ల ఎంతో మంది ఇబ్బందులు పడ్డారన్నారు. ఇప్పుడు వాళ్ల పాపం పండిందని.. చట్టపరంగా చర్యలు తప్పవన్నారు. తాము వాళ్లలాగా చట్టవిరుద్దంగా పని చేయమని.. అధికారమదంతో వాగిన వారంతా జైలుకి వెళ్లక తప్పదని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

అడ్డుగా వచ్చిన ఎలుగుబంటిని తప్పించబోయి..

బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Read Latest AP News and Telugu News

Updated Date - Feb 19 , 2025 | 11:30 AM