Buddha Venkanna : వారికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదు
ABN , Publish Date - Feb 16 , 2025 | 04:39 AM
‘ఇంటిలో ఆడవారిని తిట్టించి పైశాచిక ఆనందం పొందినవారికి రాజకీయాల్లో ఉండేందుకు కనీస అర్హత కూడా లేదు.

మహిళలపై నోరు జారడం నీచం
జగన్ రాజకీయ చరిత్ర ముగిసింది
ఇప్పటికైనా ఆయన మనిషిలా బతకడం నేర్చుకోవాలి: బుద్దా వెంకన్న
విజయవాడ (వన్‌టౌన్), ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): ‘ఇంటిలో ఆడవారిని తిట్టించి పైశాచిక ఆనందం పొందినవారికి రాజకీయాల్లో ఉండేందుకు కనీస అర్హత కూడా లేదు. అన్నం తినేవాడు ఎవరైనా ఇంటిలో ఆడవారిని తిట్టిస్తాడా? జగన్ వంటి నీచుడు మాత్రమే అలా చేస్తాడు. చంద్రబాబు తన కార్యకర్తలు ఎవరైనా నోరు జారినా ఊరుకోరు. వంశీ, కొడాలి నానితో మాట్లాడించిన జగన్ రాజకీయ చరిత్ర ముగిసింది. మొన్న ప్రజలు ఛీకొట్టి 11 సీట్లు ఇచ్చారు. ఈసారి అవికూడా రావు. ఇప్పటికైనా మనిషిగా బతకడం నేర్చుకోవాలి’ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న అన్నారు. విజయవాడలోని తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘పిల్ల సైకో వంశీ అరెస్టును ఖండిస్తూ ఎక్స్‌లో పోస్టు పెట్టిన జగన్ నీచుడు. ఎన్టీఆర్ కుమార్తెగా, చంద్రబాబు సతీమణిగా భువనేశ్వరికి సమాజంలో గుర్తింపు, గౌరవం ఉంది. తండ్రి, భర్త సీఎంలుగా ఉన్నప్పటికీ సొంతంగా పారిశ్రామికవేత్తగా ఎదిగి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అటువంటి ఆమెను అవమానిస్తే, నీచంగా మాట్లాడితే జగన్ సైకోలాగా ఆనందాన్ని పొందాడు. తల్లిని, చెల్లిని గౌరవించని జగన్‌కు ఇంతకన్నా సంస్కారం ఉంటుందని అనుకోనక్కర్లేదు. విజయసాయిరెడ్డి వంటి వారే జగన్ అరాచకాలను భరించలేక బయటికి వచ్చారు. కొడాలి నాని, వంశీ, అంబటి రాంబాబు, అనిల్ యాదవ్, వెలంపల్లి శ్రీనివాసరావు, రోజాలకు శిక్షణ ఇచ్చి జగనే మాట్లాడించాడు. వంశీ అవినీతిపై 2019లోనే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విచారణ జరిగింది.
బ్రహ్మలింగయ్య చెరువు భూములు, ఇళ్ల స్థలాల కేటాయింపులో దోచుకున్నాడు. అప్పుడే అనేకసార్లు వంశీకి చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. వైసీపీ ప్రభుత్వం రాగానే తన తప్పులను ఒప్పులుగా మార్చుకునేందుకు ఆ పార్టీలోకి వెళ్లాడన్నారు. ఉచ్ఛ నీచాలు మరచి వ్యాఖ్యలు చేసిన వంశీని అరెస్టు చేస్తే... ప్రజలు హర్షిస్తున్నారు’ అని బుద్దా అన్నారు.