Home » By Poll results
ఉత్తరప్రదేశ్‌లోని పలు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అలాంటి వేళ.. ప్రతిపక్ష సమాజవాదీ పార్టీపై సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో సమాజ హితాన్ని కాంక్షించి ప్రభుత్వం చేపట్టే ఏ మంచి పని అయినా.. సమాజ వాదీ పార్టీకి సమస్యగానే ఉంటుందన్నారు. ఆ క్రమంలో ఆ పార్టీపై సీఎం యోగి వ్యంగ్య బాణాలు సైతం సంధించారు.
లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ రాజీనామా నేపథ్యంలో వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నిక షెడ్యుల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రకటించింది. నవంబర్ 13వ తేదీన ఈ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికను నిర్వహించనున్నట్లు సీఈసీ వెల్లడించింది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ మంగళవారం న్యూఢిల్లీలో ప్రకటించారు.
హిమాచల్ ప్రదేశ్ లోని మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ 2, బీజేపీ ఒక సీటు కైవసం చేసుకున్నాయి. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు భార్య కమలేష్ ఠాకూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా దేహరా నియోజకవర్గం నుంచి 9,399 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు.
దేశంలో ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సోమవారం న్యూఢిల్లీలో విడుదల చేసింది. జూలై 10వ తేదీన ఈ ఉప ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
ఆరు రాష్ట్రాల్లో 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నిక కౌంటింగ్ శుక్రవారం కొనసాగుతోంది. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు-2024కు ముందు బీజేపీ సారధ్యంలోని ఎన్డీయేపై పోరాటం ఇండియా (I.N.D.I.A) కూటమి అత్యంత కీలకంగా భావిస్తున్న ఈ ఉపఎన్నిక ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభమైంది.