Share News

Wayanad bypoll: వయనాడ్ ఉప ఎన్నిక తేదీని ప్రకటించిన సీఈసీ

ABN , Publish Date - Oct 15 , 2024 | 05:21 PM

లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ రాజీనామా నేపథ్యంలో వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నిక షెడ్యుల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రకటించింది. నవంబర్ 13వ తేదీన ఈ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికను నిర్వహించనున్నట్లు సీఈసీ వెల్లడించింది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ మంగళవారం న్యూఢిల్లీలో ప్రకటించారు.

Wayanad bypoll: వయనాడ్ ఉప ఎన్నిక తేదీని ప్రకటించిన సీఈసీ

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ రాజీనామా నేపథ్యంలో వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నిక షెడ్యుల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రకటించింది. నవంబర్ 13వ తేదీన ఈ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికను నిర్వహించనున్నట్లు సీఈసీ వెల్లడించింది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ మంగళవారం న్యూఢిల్లీలో ప్రకటించారు. అదే సమయంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని అసెంబ్లీ, లోక్‌సభ ఉప ఎన్నికల షెడ్యూల్‌ను సైతం ఆయన విడుదల చేశారు. ఆ క్రమంలో నవంబర్ 13వ తేదీన వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు తెలిపారు.

Also Read: ట్రాఫిక్‌లో చిక్కుకున్నారా? ఇలా చేయండి.. జస్ట్ సెకన్‌లో పోలీసులు మీకు ఫోన్ చేస్తారు..?


sirani.jpg

వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నిక ఎందుకు జరుగుతుంది?

కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ వరుసగా రెండు సార్లు గెలుపొందారు. అయితే గత లోక్‌సభ ఎన్నికల్లో అంటే.. 2019లో అమేఠీతోపాటు వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ బరిలో దిగారు. కానీ ఆ ఎన్నికల్లో అమేఠీలో బీజేపీ ఎంపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఓటమి పాలయ్యారు. ఇక వయనాడ్‌లో రాహుల్ విజయం సాధించారు.


అలాగే 2024 లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి రాహుల్ గెలుపొందారు. ఇక రాయబరేలి నుంచి సైతం ఆయన గెలుపొందారు. అయితే గెలిచిన కొద్ది రోజులకు ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక దానికి ఆయన రాజీనామా చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వయనాడ్ లోక్‌సభ స్థానానికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.

Also Read: పండగ వేళ.. పలు ప్రత్యేక రైళ్లు


priyanka.jpg

ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ.. ఈ స్థానం నుంచి బరిలో దిగుతారనే ఓ ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. ఎందుకంటే.. ఈ నియోజకవర్గ ప్రజలు వరుసగా రెండు సార్లు రాహుల్ గాంధీకి పట్టం కట్టారు. అలాగే ప్రియాంక గాంధీ సైతం పోటీ చేస్తే.. వయనాడ్ ప్రజలు ఆమెకు విజయం కట్టబెడతారనే ఓ ప్రచారం అయితే బలంగా సాగుతుంది.


rgpg.jpg

అదీకాక ఇటీవల భారీ వర్షాలు వరదలతో వయనాడ్ జిల్లాలోని పలు గ్రామాలు అతలాకుతలమైంది. భారీ నష్టం సైతం సంభవించింది. ఆ సమయంలో రాహుల్, ప్రియాంక గాంధీలు ఆయా గ్రామాల్లో సైతం పర్యటించారు. అలాగే ఆ గ్రామాల ప్రజలతో సైతం వారు నేరుగా సంభాషించారు. వయనాడ్‌లో సంభవించిన ప్రకృతి ప్రళయాన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి రాహుల్ గాంధీ పలుమార్లు విజ్జప్తి చేశారు. అయినా కేంద్రం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన విషయం విధితమే. ఇక ప్రధాని మోదీ సైతం వయనాడ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. కానీ వయనాడ్‌లో జరిగిన నష్టాన్ని మాత్రం ప్రకృతి విపత్తుగా కేంద్రం ప్రకటించకపోవడం గమనార్హం.

For National News And Telugu News..

Updated Date - Oct 15 , 2024 | 05:23 PM