Uttar Pradesh : సమాజవాదీ పార్టీపై సీఎం యోగి విసుర్లు
ABN , Publish Date - Nov 08 , 2024 | 06:56 PM
ఉత్తరప్రదేశ్‌లోని పలు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అలాంటి వేళ.. ప్రతిపక్ష సమాజవాదీ పార్టీపై సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో సమాజ హితాన్ని కాంక్షించి ప్రభుత్వం చేపట్టే ఏ మంచి పని అయినా.. సమాజ వాదీ పార్టీకి సమస్యగానే ఉంటుందన్నారు. ఆ క్రమంలో ఆ పార్టీపై సీఎం యోగి వ్యంగ్య బాణాలు సైతం సంధించారు.
మొరాదాబాద్, నవంబర్ 08: తమ పాలనలో రాష్ట్రంలో కర్ఫ్యూలు లేవు... అల్లర్లు లేవని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్ స్పష్టం చేశారు. శుక్రవారం ఉత్తరపద్రేశ్‌లోని మొరాదాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజవాదీ పార్టీపై పదునైన విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వం సమాజ హితాన్ని కాంక్షించి ఏ మంచి పని చేసినా.. సమాజ్‌వాదీ పార్టీకి సమస్యగా ఉంటుందని ఆయన వ్యంగ్యంగా అన్నారు.
Also Read: Hyderabad: డ్రగ్స్ కేసులో పట్టుబడిన మహిళ: రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు
సమాజవాదీ పార్టీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరగలేదన్నారు. పైగా అక్రమాలు, అవినీతిని ఆ పార్టీ పెంచి పోషించిందని ఆరోపించారు. ఎస్పీ జెండా ఉన్న వాహనం పెద్ద గూండాకు పర్యాయపదంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక అయోధ్యలో ఆ పార్టీ నాయకుడు ఒక యువతితో అసభ్యంగా ప్రవర్తించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ తరహా ఘటనలు సమాజవాదీ పార్టీ హయాంలో చాలా చోటు చేసుకున్నాయని వివరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. సమాజం సైతం ఇటువంటి ఘటనలను సహించబోదని సీఎం ఆదిత్యనాథ్ ఉద్ఘాటించారు.
Also Read: రిటైర్ కానున్న సీజేఐ డీవై చంద్రచూడ్.. అనంతరం కోర్టులో..?
2016లో నోట్ల రద్దు అనంతరం అంటే.. 2017లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఉత్తరప్రదేశ్ ఓటరు పట్టం కట్టాడు. దీంతో యోగి ఆదిత్యనాథ్.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తన పాలనలో సీఎం యోగి తనదైన మార్క్ చూపించారు. దీంతో యూపీలో దాదాపుగా అల్లర్లు, హింసాత్మక సంఘటనలకు దాదాపుగా ఫుల్ స్టాప్ పడింది. అలాగే రాష్ట్రంలో ఎక్కడా కర్ఫ్యూలు విధించిన దాఖలాలు అయితే లేవు.
Also Read: కమలా పండు తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం మళ్లీ ఉత్తరప్రదేశ్ ప్రజలు యోగికి జై కొట్టారు. దీంతో వరుసగా రెండోసారి సీఎంగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టారు. అయితే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకో లేక పోయింది. ఈ ప్రభావం బీజేపీపై గట్టిగా పడింది. ఈ ఎన్నికల్లో బీజేపీ కేవలం 240 స్థానాలనే గెలుచుకుంది.
మరోవైపు నవంబర్ 13న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు ఉత్తరప్రదేశ్, పంజాబ్, కేరళలోని పలు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. ఆ క్రమంలో యూపీలోని 9 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ మొత్తం అసెంబ్లీ స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఈ ఎన్నికల ఫలితాలు నవంబర్ 23వ తేదీన వెలువడనున్నాయి.
For National News And Telugu News