By poll results : ఉప ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీ పరిస్థితి ఏంటంటే... 7 స్థానాలకు పోలింగ్ జరగగా...
ABN , First Publish Date - 2023-09-08T12:45:08+05:30 IST
ఆరు రాష్ట్రాల్లో 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నిక కౌంటింగ్ శుక్రవారం కొనసాగుతోంది. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు-2024కు ముందు బీజేపీ సారధ్యంలోని ఎన్డీయేపై పోరాటం ఇండియా (I.N.D.I.A) కూటమి అత్యంత కీలకంగా భావిస్తున్న ఈ ఉపఎన్నిక ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభమైంది.
న్యూఢిల్లీ: ఆరు రాష్ట్రాల్లో 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నిక కౌంటింగ్ శుక్రవారం కొనసాగుతోంది. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు-2024కు ముందు బీజేపీ సారధ్యంలోని ఎన్డీయేపై పోరాటం ఇండియా (I.N.D.I.A) కూటమి అత్యంత కీలకంగా భావిస్తున్న ఈ ఉపఎన్నిక ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. వేర్వేరు కారణాలతో జరిగిన ఈ ఎన్నికలకు శుక్రవారం ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభమైంది.
ప్రస్తుత ట్రెండింగ్స్ ఇలా...
1. దుమ్రి (జార్ఖండ్) - ఏజేఎస్‌యూ పార్టీ లీడ్.
2. పుతుప్పల్లి (కేరళ) - కాంగ్రెస్ లీడ్.
3. ఘోసి (ఉత్తరప్రదేశ్) - సమాజ్‌వాదీ పార్టీ లీడ్
4. బక్సానగర్ (త్రిపుర) - బీజేపీ గెలుపు
5. ధన్‌పుర్ (త్రిపుర) - బీజేపీ గెలుపు
6. బాగేశ్వర్ (ఉత్తరఖండ్) - బీజేపీ లీడ్
7. ధూప్‌గురి (పశ్చిమబెంగాల్) - బీజేపీ లీడ్
త్రిపురలో బీజేపీ జయకేతనం..
త్రిపురలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నిక జరగగా ఆ రెండు స్థానాల్లోనూ బీజేపీ విజయం సాధించింది. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ధన్‌పూర్, బాక్సానగర్ సీట్లలో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. బాక్సానగర్ సీటులో బీజేపీకి చెందిన టాపాజ్జల్ హోసైన్ ఏకంగా 30,237 ఓట్ల మెజారిటీతో గెలుపొందించారు. పోలైన ఓట్లలో 66 శాతం హోసైన్‌కే పడ్డాయి. హోసైన్‌కి మొత్తం 34,146 ఓట్లు పడగా సమీప అభ్యర్థి మిజాన్ హోసైన్‌కి (సీపీఐ(ఎం)) కేవలం 3,909 ఓట్లు మాత్రమే పడ్డాయి.
ఇక ధన్‌పూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బిందు దేబ్‌నాథ్ గెలుపొందారు. గిరిజన జనాభా ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో బిందు దేబ్‌నాథ్ 18,871 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక మిగతా నియోజవర్గాలకు సంబంధించిన ఫలితాలపై ఈసీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.