Share News

Assembly bypolls results 2024: సీఎం భార్య గెలుపు, కాంగ్రెస్‌కు 2, బీజేపీకి ఒకటి

ABN , Publish Date - Jul 13 , 2024 | 03:00 PM

హిమాచల్ ప్రదేశ్ లోని మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ 2, బీజేపీ ఒక సీటు కైవసం చేసుకున్నాయి. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు భార్య కమలేష్ ఠాకూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా దేహరా నియోజకవర్గం నుంచి 9,399 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు.

Assembly bypolls results 2024: సీఎం భార్య గెలుపు, కాంగ్రెస్‌కు 2, బీజేపీకి ఒకటి

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లోని మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ 2, బీజేపీ ఒక సీటు కైవసం చేసుకున్నాయి. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు భార్య కమలేష్ ఠాకూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా దేహరా (Dehra) నియోజకవర్గం నుంచి 9,399 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. ఉప ఎన్నికల కౌంటింగ్ శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.


దేహరా అసెంబ్లీ నియోజకవర్గం 2012లో నియోజకవర్గాల పునర్విజన అనంతరం ఏర్పడింది. 2012లో బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రవీంద్ర సింగ్ ఇక్కడి నుంచి ఎన్నిక కాగా, 2017, 2022లో ఇండిపెండెంట్లు గెలుచుకున్నారు. ఈసారి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కమలేష్ ఠాగూర్ గెలుపొందారు. ఉప ఎన్నికల్లో గెలుపు అనంతరం కమలేష్ ఠాకూర్ మాట్లాడుతూ, పార్టీ నేతలు, కార్యకర్తలు రేయింబవళ్లు శ్రమించారని, పార్టీకి అండగా నిలిచిన డెహ్రా ప్రజలకు ఈ గెలుపు దక్కుతుందని అన్నారు.

Lalu Prasad Yadav: 'మిస్టర్ లాలూ మీ వీల్‌ఛైర్ ఎక్కడ'.. ఎన్డీయే ఘాటు విమర్శలు


హమీర్‌పూర్‌లో బీజేపీ, నాలాగఢ్‌లో కాంగ్రెస్

హమీర్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఆశిష్ శర్మ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి పుష్పేందర్ వర్మపై 1,571 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కాగా, నాలాగఢ్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఆ పార్టీ నేత హర్దీప్ సింగ్ బవ తన సమీప బీజేపీ అభ్యర్థి కెఎల్ ఠూకూర్‌పై 8,990 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. హర్దీప్ సింగ్ హిమాచల్ ప్రదేశ్ ఇండియన్ నేషల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఐదుసార్లు పనిచేశారు.

For Latest News and National News click here

Updated Date - Jul 13 , 2024 | 03:46 PM