CAA: సీఏఏపై సుప్రీంలో విచారణ.. న్యాయమూర్తులు ఏమన్నారంటే..
ABN , Publish Date - Mar 19 , 2024 | 02:57 PM
పౌరసత్వ సవరణ చట్టం (CAA) నిబంధనలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. పిటిషన్లపై కేంద్రప్రభుత్వం తన స్పందన తెలియజేయాలంటూ తదుపరి విచారణకు ఏప్రియల్9వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈకేసును విచారించింది.
పౌరసత్వ సవరణ చట్టం (CAA) నిబంధనలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. పిటిషన్లపై కేంద్రప్రభుత్వం తన స్పందన తెలియజేయాలంటూ తదుపరి విచారణకు ఏప్రియల్9వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈకేసును విచారించగా.. ప్రభుత్వం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపించారు. ఈ పిటిషన్లపై విచారణ పూర్తయ్యే వరకు సీఏఏ నిబంధనలపై స్టే విధించవద్దని తుషార్ మెహతా కోరారు. వీటిపై పూర్తిగ స్పందించేందుకు కొంత సమయం కావాలని అభ్యర్థించారు. దీంతో న్యాయస్థానం తదుపరి విచారణను ఏప్రియల్ 9వ తేదీకి వాయిదా వేస్తూ.. ఈ పిటిషన్లపై కేంద్రంప్రభుత్వం తన అభిప్రయాన్ని తెలియజేయాలని ఆదేశించింది.
పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుపై కొన్ని వర్గాలు నిరసన తెలుపుతున్నాయి. సీఏఏను (CAA) నిబంధనలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో (Supreme Court) దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కేరళకు చెందిన ఇండియన్ ముస్లిం లీగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. లోక్ సభ ఎన్నికల వేళ వివాదాస్పద చట్టం అమలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మతం ఆధారంగా సీఏఏ అమలు చేస్తున్నారని, ప్రత్యేకించి ముస్లింలపై వివక్ష చూపుతుందని ఇతర పిటిషనర్లు పేర్కొన్నారు. మతపర విభజన వల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం వారి హక్కులను ఉల్లంఘించడం అవుతోందని ముస్లింలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముస్లిం సంఘాలతో పాటు తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రా, కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్, మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, అసోం కాంగ్రెస్ నేత దేబబ్రత సైకియా, ఎన్జీవో రిహయ్ మంచ్ తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినవారిలో ఉన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..