Share News

Kejriwal: వారు జైలులో ఉండాల్సిన వారు... శరణార్థులపై కేజ్రీవాల్ స్ట్రాంగ్ కామెంట్స్..

ABN , Publish Date - Mar 15 , 2024 | 04:58 PM

పొరుగు దేశాల నుంచి ఇండియాలో శరణార్థులుగా ఉంటున్న వారు దేశ రాజధాని దిల్లీలో చేసిన నిరసనలపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరంతా జైలులో ఉండాల్సి వారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Kejriwal: వారు జైలులో ఉండాల్సిన వారు... శరణార్థులపై కేజ్రీవాల్ స్ట్రాంగ్ కామెంట్స్..

పొరుగు దేశాల నుంచి ఇండియాలో శరణార్థులుగా ఉంటున్న వారు దేశ రాజధాని దిల్లీలో చేసిన నిరసనలపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరంతా జైలులో ఉండాల్సి వారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ నుంచి వచ్చిన హిందూ శరణార్థులు అక్బర్ రోడ్డులోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద నిరసనలు చేపట్టారు. రాహుల్ గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకుని నిరసనకారులను అడ్డుకున్నారు. భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

కాగా.. సీఏఏ పై కేజ్రీవాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. భారతదేశంలోని ప్రజలకే ఉపాధి లేదన్న ఆయన బయటి వ్యక్తులను దేశంలో ఎందుకు రానిస్తున్నారని కేంద్రాన్ని నిలదీశారు. సీఏఏతో దేశవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. తాము భారత పౌరసత్వం తీసుకున్నందున భారతదేశ ప్రజలమేనని, తీవ్రవాదులు అనే ముద్ర వేయడం ఎంత వరకు సమంజసం అని నిరసనకారులు ప్రశ్నించారు. గత 15 సంవత్సరాలుగా దిల్లీలో నివసిస్తున్నామన్నారు. ఈ ఇబ్బందులు చూడలేక ప్రధాన మంత్రి మోదీ ప్రభుత్వం తమకు పౌరసత్వం ఇచ్చేలా చర్యలు తీసుకున్నారని ఆందోళనకారులు చెప్పుకొచ్చారు.


మరోవైపు.. నిరసనల తర్వాత దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోషల్ మీడియాలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "ఈ పాకిస్థానీల ధైర్యం? మొట్టమొదట మన దేశంలోకి అక్రమంగా చొరబడి, మన దేశంలోని చట్టాలను ఉల్లంఘించారు. జైల్లో ఉండాల్సిన వారు నిరసనలు చేసి అలజడులు సృష్టిస్తున్నారు. సీఏఏ వచ్చాక పాకిస్థానీలు, బంగ్లాదేశీయులు దేశమంతటా వ్యాపించి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తారు. వారిని తన ఓటు బ్యాంకుగా మార్చుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ దేశం మొత్తాన్ని ఇబ్బందుల్లోకి నెడుతోంది". అని కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 15 , 2024 | 05:09 PM