Home » Chandra Babu
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మళ్లీ కేంద్రంలో చక్రం తిప్పబోతున్నారనే ఓ చర్చ అయితే ఏపీ రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తుంది. ఆ క్రమంలో ఆయన కింగ్ మేకర్‌గా వ్యవహరించే అవకాశాలు సైతం ఉన్నాయని సదరు సర్కిల్లో వైరల్ అవుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు.. ఆ రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాల్లో సైతం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభంజనం సృష్టించింది.
AP Election Results 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి గెలుపొందడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు అభినందనలు తెలిపారు రేవంత్. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్.
ఏపీలో అధికారంలోకి రావాలంటే గోదావరి జిల్లాల్లో గెలవాలనేది ఒక సెంటిమెంట్. ఈ రెండు జిల్లాల్లో కలిపి మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ మెజార్టీ సీట్లు గెలిచిన పార్టీ ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది.
అధికారం శాశ్వతం అనుకుని ప్రత్యర్థి పార్టీల నేతలపై వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా బూతుల వర్షం కురిపించిన వైసీపీ మంత్రులకు ఆయా నియోజకవర్గాల ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. వైసీపీకి చెందిన పలువురు మంత్రలు అధిష్టానం దగ్గర మెప్పు కోసం తీవ్రమైన భాషతో ప్రత్యర్థి పార్టీల నేతలను తూలనాడారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం కూటమి సంచలనం విజయం దక్కించుకుంది. పొత్తులో భాగంగా 144 శాసనసభ స్థానాల్లో పోటీచేసిన టీడీపీ130కి పైగా స్థానాల్లో విజయం సాధించింది. జనసేన పోటీచేసిన 21 స్థానాల్లో విజయం సాధించింది.
గత పదేళ్లుగా తిరుగు లేని ఆధిపత్యంతో దేశాన్ని పాలించిన బీజేపీకి ఈసారి ఎదురుగాలి వీస్తోంది. 350 స్థానాలు గ్యారెంటీ అని ఎగ్జిట్ పోల్స్ చెప్పిన జోస్యాలు నిజం కాలేదు. ఈసారి ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ మీద ఆధారపడాల్సి ఉంటుంది.
జూన్ 9న సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనుండటం ఇది నాలుగోసారి కావడం విశేషం. అమరావతిలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగనుంది. టీడీపీ చరిత్రలోనే అతి పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. 161 సీట్లతో అధికారాన్ని చేజించుక్కించుకోనుంది.
టీడీపీ అధినేత చంద్రబాబు ముందు చెప్పినట్టుగానే వైసీపీని చావు దెబ్బ కొట్టారు. దాదాపు 162 స్థానాల్లో టీడీపీ కూటమి హవా చాటుతోంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళుతోంది. కౌంటింగ్ కేంద్రాల నుంచి వైసీపీ నేతలంతా ఇళ్ల బాట పట్టారు. కనీసం కంచుకోట అయిన రాయలసీమలోనూ వైసీపీ హవా చాటడం లేదు. కనీసం జగన్మోహన్ రెడ్డి కంచుకోట అయిన కడప జిల్లాలోనూ వైసీపీ ప్రభావం అంతంత మాత్రమే. కూటమి సునామీ ముందు వైసీపీ నిలవలేకపోయింది.
దాదాపు 93 శాతం స్ట్రైక్‌రేటుతో విజయం దిశగా ఎన్టీఏ కూటమి పయనిస్తోంది. కౌంటింగ్ కేంద్రాల నుంచి వైసీపీ అభ్యర్థులంతా ఇంటి బాట పడుతున్నారు. 159 స్థానాల్లో విజయం దిశగా కూటమి దూసుకెళుతోంది. తెలుగు దేశం పార్టీ చరిత్రలోనే ఇది అతి పెద్ద విజయం. 1994లో అతి పెద్ద విజయాన్ని టీడీపీ నమోదు చేసింది.
ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ హవా కొనసాగిస్తోంది. వాస్తవానికి రాయలసీమ వైసీపీకి అడ్డా. ఇప్పుడు ఇక్కడంతా టీడీపీ హవా నడుస్తోంది. ముఖ్యంగా కడప జిల్లాలో టీడీపీ ముందంజలో ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కడప, మైదుకూరు, రాయచోటి, జమ్మలమడుగులో టీడీపీ ముందంజలో ఉంది. బద్వేలులో వైసిపీ అభ్యర్థి 1483 ఓట్లతో ముందంజలో ఉన్నారు.