Home » Chandra Babu
ఎన్టీఆర్ ఆశయ సాధనకు కలిసి పనిచేద్దామంటూ ప్రధాని మోదీని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మోదీ చేసిన ట్వీట్‌కు చంద్రబాబు ఎక్స్‌లో రిప్లై ఇచ్చారు. ఎన్టీఆర్ తెర ముందు, తెర వెనకా ఓ లెజెండ్ అని కొనియాడారు. పేదల సంక్షేమం, అభివృద్ధి వికేంద్రీకరణతో ఎన్టీఆర్ మనందరికీ స్ఫూర్తిగా నిలిచారన్నారు.
పోలింగ్‌కు ముందు డికోడర్ ఛానల్‌కు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ లోని కొన్ని భాగాలను ట్విటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసింది. ప్రణయ్ రాయ్, దొరబ్‌లు అడిగిన ప్రశ్నలకు సీఎం జగన్ సమాధానం చెప్పారు. ఇంటర్వూ ఆద్యంతం ఆశువుగా అబద్ధాలు చెప్పారు. జగన్ ఏం చెప్పారు? అసలు వాస్తవమేంటో చూద్దాం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, పూర్వపు ముదినేపల్లి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, విజయ డెయిరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి (74) ఇక లేరు.
ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి, పూర్వపు ముదినేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, విజయ డెయిరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి(74) హైదరాబాద్‌లోని తన కుమార్తె హంసిని ఇంటిలో సోమవారం వేకు వ జామున గుండెపోటుతో కన్నుమూశారు.
ఏపీలో మే 13వ తేదీ జరిగిన పోలింగ్ రోజున వైసీపీ వర్గీయులు ఎలా రెచ్చిపోయారో అందరికీ తెలుసు. ఓటమి భయం చుట్టుముట్టడంతో ఏం చేయాలో పాలుపోక.. రిగ్గింగ్‌కు పాల్పడేందుకు..
మీకు మేమున్నాం.. మీ సమస్యేంటో చెప్పండి క్షణాల్లో పరిష్కరిస్తాం.. ఓటరు వెళ్లి అడిగిందే తడవు.. ఏ పనైనా రోజులో జరిగి పోయేది.. పోలింగ్ ముందు వరకూ ఇదీ సీన్.. మరిప్పుడు.. నాయకులు కనిపించడమే మానేశారు.. పోలింగ్ ముగిసిన నాటి నుంచి నాయకులు బయటకే రావడంలేదు.. కొంత మంది తమ నాయకుడు విదేశాలకు వెళ్లిపోతే.. మరికొంత మంది అదే బాటలో ఉన్నారు..
రాష్ట్రంలో ఇటివల ఎన్నికలు పూర్తి కాగా, అందరూ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు సర్వేలు అనేక రకాల రిపోర్టులను వెల్లడించాయి. ఈ క్రమంలో మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అమరావతిలో తప్పకుండా ప్రమాణస్వీకారం చేస్తారని రఘురామ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతోపాటు సీఎం జగన్, పాల్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీపై(PM Narendra Modi) సంచలన ఆరోపణలు చేశారు సీఐపీ నేత నారాయణ(CPI Narayana). పొలిటికల్ ప్రచారంపై ఎన్నికల కమిషన్(Election Commission of India) ఇచ్చిన స్టేట్మెంట్ ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని..
మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ నేతలు వెల్లడించారు. ఈవీఎం ధ్వంసం చేసి, అరాచకం సృష్టించిన పిన్నెలిని తక్షణమే అరెస్ట్ చేయాలని డీజీపీని కలిసి మెమోరాండం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని తెలుగుదేశం పార్టీ నేత, ఉండి టీడీపీ అభ్యర్థి రఘురామ కృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. ఈ నెల 13వ తేదీన వైసీపీకి ప్రజలు తిరస్కరించారని వివరించారు. ఒకవిధంగా ఆ పార్టీ 13వ తేదీన చనిపోయిందని తెలిపారు. జూన్ 4వ తేదీన సీఎం జగన్ దిమ్మదిరిగే ఫలితాలు రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.