Home » Chandra Babu
కేశినేని చిన్ని (శివనాథ్ ) ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా వైసీపీ నుంచి టీడీపీలోకి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు క్యూలు కడుతున్నారు. ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చప్పిడి కృష్ణమోహన్ , కార్యవర్గంతో సహా ఐదు వందల మంది నేడు టీడీపీలో చేరారు. వారికి కేశినేని చిన్ని పసుపు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
2019లో పరిస్థితి వేరు.. ఇప్పుడు వేరు. ఆ సమయంలో ఒక్క ఛాన్స్ అని ప్రజలను జగన్ అడిగారు. సరేలే అని అవకాశం ఇచ్చి ఉంటారు. ఛాన్స్ ఇస్తే ఏం చేశాడో ఆ జనమే చూశారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజా వేదిక కూల్చి తన మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నాడు. తర్వాత విపక్ష నేతలను టార్గెట్ చేశాడు. తొలినాళ్లలో కరెంట్ సమస్య ఎక్కువగా ఉండేది. రహదారుల సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికి రహదారుల మరమ్మతులు జరగలేదు. అందుకే ఈ సారి కూటమి వైపు జనాలు మొగ్గు చూపే అవకాశం ఉంది.
ఓడిపోతే.. ఇక్కడ నాకెందుకులే పనంటూ ఎవరైనా పక్కకు తప్పుకుని పోతారు. కానీ నారా లోకేశ్ అలాకాదు. మరోసారి పోటీలో నిలిచారు.
Andhrapradesh: తెలుగు దేశం పార్టీకి ముస్లిం సంఘాలు పూర్తి మద్దతు తెలుపుతున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలవాలని, చంద్రబాబు సీఎం అవ్వాలని ముస్లిం సంఘాల నేతలు కోరుతున్నారు. తాజాగా టీడీపీకి జమాత్ ఉలమ ఏ హింద్ పూర్తి మద్దతు తెలిపింది. గురువారం టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జమాత్ ఉలమ ఏ హింద్ జాతీయ అధ్యక్షులు మౌలానా సుహైబ్ ఖాసిమి భేటీ అయ్యారు.
నా మీద పెట్టిన ఒత్తిడి అంతా ఇంతా కాదు! ఐదేళ్లు కంటి మీద సరిగా కునుకులేదు. నేను ఎన్ఎ్సజీ రక్షణలో ఉన్నా. అయినా నాఇంటిపైన డ్రోన్స్ ఎగరేశారు. ఇల్లు ఖాళీ చేయాలని బెదిరించారు.
వైఎస్ జగన్ మళ్లీ గెలిచే ప్రసక్తే లేదని, విభజన కంటే జగన్ పాలనలోనే ఎక్కువ నష్టం జరిగిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఏబీఎన్ 'బిగ్ డిబేట్' ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని, ఆదాయాన్ని పెంచుతామని చెప్పారు.
ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ ఓడిపోతున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అతడు మళ్లీ వస్తాడని జీరో పర్సెంట్ కూడా లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. బుధవారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబెట్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధాన మిచ్చారు.
పేదరికం లేని తెలుగువారిని చూడాలన్నదే తన కోరిక అని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఏబీఎన్ బిగ్ డిబేట్లో.. చంద్రబాబునాయుడు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు.. మీరు సీఎం అయినంత మాత్రాన ఏపీని బాగుచేయగలరా... అంటూ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రశ్నించారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అతడి తండ్రే భరించలేకపోయాడని, అందుకే అప్పట్లో అతన్ని బెంగళూరు పంపించాడని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే జగన్ను తాను పూర్తిగా అంచనా వేయలేకపోయానని చంద్రబాబు చెప్పారు.