Home » Chandrababu arrest
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆపార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సతీమణి నారా బ్రహ్మణి ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన వస్తోంది. ‘‘మోత మోగిద్దాం’’ అంటూ బ్రహ్మణి ఇచ్చిన పిలుపుతో ఉదయం నుంచే విశాఖ వాసులు సంపూర్ణ మద్దతు తెలిపారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఐటీ ఉద్యోగులు మద్దతుగా నిలిచారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని.. వెంటనే ఆయనను విడుదల చేయాలంటూ హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులు డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. చంద్రబాబుకు మద్దతుగా ర్యాలీలు, ఆందోళనలు కూడా చేపట్టారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను ప్రతీ ఒక్కరూ ఖండిస్తున్నారు. అరెస్ట్ అక్రమమని పార్టీలకు అతీతంగా నేతలు చెబుతున్నారు. తాజాగా సినీ దర్శకుడు రవిబాబు కూడా చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించారు.
తనకు నచ్చని వ్యక్తి ఇబ్బందుల్లో ఉంటే చూసి పరమానందం పొందడం కొందరినైజం!. ప్రత్యర్థుల కష్టాలనే సంతోషకర క్షణాలను భావించి మురిసిపోతూ ముసిముసి నవ్వులు చిందిస్తుంటారు!. గత రెండు రోజులుగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రవర్తిస్తున్న తీరుని గమనిస్తే ఆయన కూడా ఈ వర్గానికే చెందుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే..
సేవ ఆంధ్రప్రదేశ్.. సేవ్ డెమోక్రసీ.. సత్యమేవ జయతే.. అని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నినదించారు.
అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు వేయాలని నిర్ణయించారే తప్ప రోడ్డు వేయలేదని, భూసేకరణ జరగలేదని, పైసా నిధులు కూడా ఇవ్వలేదని,
ఏసీబీ కోర్ట్ నుంచి కోర్టు హాలు నుంచి ఇరు వర్గాల న్యాయవాదులు బయటకి వెళ్లిపోయారు. అయితే ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మళ్లీ వెనక్కి వచ్చారు. తమ వాదనలు ఇప్పుడే వినాలని న్యాయమూర్తిని సుధాకర్ రెడ్డి కోరారు. అయితే ఇందుకు న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు.
స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి హైకోర్టులోనూ నిరాశే ఎదురైంది. చంద్రబాబు పిటిషన్‌లపై ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా పడింది. చంద్రబాబు బెయిల్, రిమాండ్ పిటిషన్‌లపై విచారణ అక్టోబర్ 4కి వాయిదా వేస్తున్నట్టు విజయవాడ ఏసీబీ కోర్టు వెల్లడించింది.
సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కు వాయిదాపడింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సరస వెంకటనారాయణ భట్టి ధర్మాసనం తొలుత విచారణ మొదలుపెట్టింది. అయితే విచారణ నుంచి జస్టిస్ భట్టి తప్పుకున్నారు. దీంతో కేసులు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఎదుట మెన్షన్ చేసే అవకాశం ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు.