Home » Chandrababu
గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్కు సమీపంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం పనులను టీడీపీ ముఖ్య నేతలు, పోలీస్ ఉన్నతాధికారులు ముమ్మరం చేశారు. 11 ఎకరాల విశాల ప్రదేశంలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, ఐజీ అశోక్ కుమార్,పలు ఉన్నత అధికారులు పర్యవేక్షణలో ప్రమాణ స్వీకారం సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం(Andhra Pradesh Government) మారింది.. మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత ప్రభుత్వంలో కీలక పొజీషన్లో ఉండి.. అనేక ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులపై వేటు పడుతోంది. ఇప్పటికే సీఎస్ జవహార్ రెడ్డి(CS Jawahar Reddy) సెలవులపై వెళ్లిపోగా..
తాను ఎంపీగా ఉండగా.. జగన్ తన సలహాలు పాటించారని బీజేపీ నేత, మాజీ ఎంపీ వరప్రసాద్ తెలిపారు. సీఎంగా గెలుచిన తరువాత జగన్ బాగా మారిపోయారన్నారు. రెడ్డి సామాజిక వర్గంలో ధనంజయరెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల మిథున్ రెడ్డి వల్లనే వైసీపీని వీడాల్సి వచ్చిందన్నారు. వైసీపీలో సొంత పార్టీ వారిపై కేసులు పెట్టించిన ఘనత సజ్జలదేనని పేర్కొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయడితో పార్టీ ఎంపీలు భేటి అయ్యారు. అందుబాటులో ఉన్న పలువురు ఎంపీలు ఉండవల్లిలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ప్రత్యక్షంగా హాజరయ్యారు. ఇతర ఎంపీలు జూమ్ కాల్ ద్వారా టీడీపీ సమావేశంలో పాల్గొన్నారు. ఎంపీలు అందరికీ చంద్రబాబు నాయుడు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయంతో ఉన్నతాధికారుల్లో టెన్షన్ మెుదలైంది. ఇప్పటికే సీఐడీ చీఫ్ సంజయ్(CID Chief Sanjay) సెలవు(Leave) పెట్టి అమెరికా వెళ్తున్నట్లు సమాచారం. జగన్ హయాంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు(Chandrababu)పై తప్పుడు కేసులు నమోదు చేయడంలో సంజయ్ కీలక పాత్ర వహించారు.
Prime Minister Of India: దేశ భవిష్యత్ను నిర్దేశించే ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఫలితాలూ వచ్చేశాయి.. కానీ, ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఇచ్చారు ఓటర్లు. ఎవరికీ పూర్తిస్థాయి మెజార్టీ ఇవ్వకపోవడంతో.. మళ్లీ సంకీర్ణ సర్కార్ అనివార్యమైంది. దీంతో అసలు చర్చ ఇప్పుడే ప్రారంభమైంది. ఇంతకాలం మోదీ 3.0 సర్కార్ వస్తుందని అంతా అనుకున్నా.. సీన్ రివర్స్ అయ్యింది. ఎగ్జిట్ పోల్స్ ఎగబడి ఎగబడి.. మోదీ నామం జపించినా..
దేశ రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన లీడర్. ఓ విజన్ ఉన్న నాయకుడు. అభివృద్ధి అజెండాతో ముందుకెళ్లే చంద్రబాబు సీఎం కావాలని ఏపీ ప్రజలు సంకల్పించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(AP Assembly) ఎన్నికల్లో తమ విజయం తద్యమని కూటమి అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. ఈసారి జరిగిన ఎన్నికలకు ఎగ్జిట్ పోల్స్ కూడా అవసరం లేదని, తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు కూటమి తరఫున పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థులతో అగ్రనేతలు చంద్రబాబు (Chandrababu), అరుణ్ సింగ్, పురందేశ్వరి, నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) జూమ్ మీటింగ్ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ తర్వాత సైలెంట్గా ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు (Chandrababu) తొలిసారి స్పందించారు. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి..? అనేదానిపై..
NTR 101 Birth Anniversary: దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101 జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రంలో ఘనంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన అభిమానులు, టీడీపీ నేతలు నివాళులర్పిస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ఆయా పార్టీల నాయకులు ఎన్టీఆర్కు ఘన నివాళులర్పించారు.