AP CM: తిరుమలకు చంద్రబాబు
ABN , Publish Date - Jun 12 , 2024 | 05:28 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి మరికాసేపట్లో తిరుమలకు బయలుదేరి వెళ్లనున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి బయలుదేరనున్నారు.
అమరావతి, జూన్ 12: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి మరికాసేపట్లో తిరుమలకు బయలుదేరి వెళ్లనున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి బయలుదేరనున్నారు. రాత్రి 9.00 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్ట్‌కు చేరుకొనున్నారు. అనంతరం రేణిగుంట నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకోనున్నారు.
తిరుమలలోని శ్రీగాయత్రి నిలయం గెస్ట్‌హౌస్‌లో సీఎం చంద్రబాబ ఈ రోజు రాత్రి బస చేయనున్నారు. రేపు అంటే గురువారం ఉదయం శ్రీవెంకటేశ్వరస్వామిని చంద్రబాబు.. తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకోని మొక్కులు చెల్లించుకోనున్నారు. అంతుకు ముందు చంద్రబాబుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు.. తిరుమలోని శ్రీ భూ వరాహ స్వామి ఆలయాన్ని సైతం సందర్శించకోనున్నారు.
Also Read: Amaravati: చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తమిళి సైపై అమిత్ షా సీరియస్
అనంతరం అంటే.. రేపు ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేణిగుంట ఎయిర్‌పోర్ట్ చేరుకుని.. ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు వస్తారు. ఆ తర్వాత నేరుగా ఉండవల్లిలోని నివాసానికి ఆయన వెళ్లనున్నారు.
మరోవైపు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. తిరుపతి పర్యటన నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. అందులోభాగంగా రహదారులు, తిరుమల ఘాట్ రోడ్లలో స్పెషల్ పోలీసుల బృందం ముమ్మర తనిఖీలు నిర్వహిస్తుంది.
Also Read: Delhi Water Crisis: ఆప్ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించిన సుప్రీంకోర్టు
ఇంకోవైపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో తిరుపతి శ్రీవారిని దర్శించుకోనున్న నేపధ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అయితే టీటీడీ ఈవో ఏ.వి.ధర్మారెడ్డి ఇప్పటికే సెలవుపై వెళ్లారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అందుబాటులో ఉండాలంటూ ఆయనకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు రేణుగుంట ఎయిర్ పోర్ట్ చేరుకోగానే.. ఆయనను స్వాగతించే ఉన్నతాధికారుల జాబితాలో ఈవో ధర్మారెడ్డి పేరు సైతం ఉందని సమాచారం.
Read Latest Andhra Pradesh News and Telugu News