Home » Chandrababu
విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా కృషి చేస్తున్నారు. గత రెండు రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లోనే ఉన్న ఆయన.. ఇవాళ (మంగళవారం) కూడా మరిన్ని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ఈ రోజు జేసీబీపై నాలుగున్నర గంటలపాటు వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు.
సీఎం సహాయ నిధికి విరాళాలు అందించాలని ఇరురాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ పిలుపునకు హిందూపురం ఎమ్మెల్యే, దిగ్గజ సినీనటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి కోటి రూపాయల విరాళాన్ని బాలయ్య ప్రకటించారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో విజయవాడ నగరం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తడంతో లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలు ఇప్పుడిప్పుడు ఊపందుకుంటున్నాయి. ఈ కార్యక్రమాలను మరింత ముమ్మరంగా కొనసాగించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కీలకమైన ప్రకటన చేశారు.
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరించినా చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్న మాజీ మంత్రి కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పక్క రాష్ట్రం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పోల్చి మరీ విమర్శలు గుప్పించారు.
సీఎం చంద్రబాబు నాయుడు మొదలుకొని, సమస్త యంత్రాంగ సహాయక చర్యల్లో పాల్గొని అంతా కష్టపడుతుంటే.. నాణేనికి మరోవైపు అన్నట్టుగా.. కాదేదీ దోపీడీకి అనర్హం అన్నట్టుగా కొందరు అనాగరికతను ప్రదర్శిస్తున్నారు. ఆపదకాలంలో నిశ్రయులుగా మారిన వారి నుంచి డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధి ప్రదర్శిస్తున్నారు.
దాదాపు రెండు రోజులుగా విజయవాడ వరద బాధితుల కోసం సీఎం చంద్రబాబు నాయుడు ఎంతలా కష్టపడుతున్నారో అందరికీ తెలిసిందే. సాధ్యమైన అన్ని చర్యలూ తీసుకున్నారు. ముఖ్యంగా వరద బాధితులకు ఆహారం విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆయన ముందస్తు చర్యలు తీసుకున్నారు. నిద్రాహారాలు మానుకొని వరద బాధితులను పరామర్శించారు.
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తున్నారు. అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. దీంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కాగా కూటమి ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. స్వయంగా సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయిలో చర్యలు చేపడుతోంది.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. స్వయంగా ఆయన వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. నేరుగా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి సమీక్షలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల్లో, పలు పట్టణాల్లో భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితులపై అధికారులతో చంద్రబాబు మాట్లాడారు.
ఇంగ్లీష్ వస్తే ఉద్యోగాలు వస్తాయనుకోవడం పొరపాటేనని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. జ్ఞానం పెరగాలంటే మాతృ భాషలోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన తెలుగు భాషా దినోత్సవ వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు.