Home » Chandrababu
ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ జీవితంపై ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో పలువురు మంత్రుల ప్రస్తావించారు. సీఎంగా చంద్రబాబు తొలిసారి బాధ్యతలు స్వీకరించి సెప్టెంబర్ 1 నాటికి 30 సంవత్సారాలు పూర్తవనున్నాయి.
ఏపీ కేబినెట్ భేటీలో సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తన కారణంగా ఇన్నాళ్లు నిర్మించుకున్న మంచిపేరు దెబ్బతింటోందని మంత్రులతో అన్నారు. పేపర్ల నిండా వారు చేసిన పొరపాట్లను ప్రస్తావిస్తూ వార్తలు వస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సీఎం చంద్రబాబు సచివాలయానికి రానున్నారు. విజన్ 2047 రూపకల్పనపై నీతి ఆయోగ్ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. అనంతరం దేవాదాయ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.
తెలంగాణ తెలుగు దేశం పార్టీకి(TTDP) నూతన జవసత్వాలు అందించడానికి ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు(CM Chandrababu) సిద్ధమయ్యారు.
తెలంగాణ తెలుగు దేశం పార్టీ బాధ్యతలు ఎవరికి అప్పగించబోతున్నారనే చర్చ ఇప్పటికీ నడుస్తూనే ఉంది. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) ఈ అంశంపై నాయకులకు స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) శుక్రవారం అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో(Ambedkar Konaseema Dist) పర్యటించనున్నారు.
ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని కోరుతూ పిటిషన్ వేసిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.
అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో 14 మంది మృతి చెందారు. మరో 50 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం అచ్యుతాపురానికి వెళ్లనున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలతోపాటు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించనున్నారు.
ఋషికొండపై భవనాలు ఒక పేదవాడు కట్టుకున్న చిన్న పూరి గుడిసె అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్‌పై మంత్రి కందుల దుర్గేశ్ వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఆ ఋషికొండ భవనాలను ఏం చేయాలో ఇంకా తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ భవనాల నిర్మాణం కోసం గత పాలకులు ప్రజాధనాన్ని దుర్మార్గంగా ఖర్చు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అడుగడుగునా అడ్డుకోవాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ ప్రయత్నిస్తున్నారని మాజీమంత్రి జవహర్ ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపై బురద జల్లాలని ఆ పార్టీ నేతలు విశ్వప్రయత్నాలు చేశారని విమర్శించారు.