Home » Chennai
తమిళనాడు రాజధాని నగరం చెన్నైలో ఘోరం జరిగింది. ఓ స్కూల్ చిన్నారి తన తల్లి, తమ్ముడుతో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా వారి పక్కగా వెళుతున్న ఆవు దాడి చేసింది. ఆవు తన కొమ్ములతో దాడి చేయడంతో ఆ పాప తీవ్రంగా గాయపడింది. అయితే.. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పింది.
దేశంలో టమాటాల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. నిన్న మొన్నటి వరకు కిలో టమాటాల ధర రూ.100 దాటితేనే వామ్మో అనుకున్న వినియోగదారులకు ఇప్పుడు మరో షాక్ తగిలింది. ప్రస్తుతం టమాటాల ధరలు మరింత పెరిగిపోయాయి. ఆల్టైమ్ అత్యధిక ధరలు పలుకుతున్నాయి.
మణిపూర్ హింసపై భారత ప్రధాన న్యాయమూర్తి , సుప్రీంకోర్టుపై చేసిన వ్యాఖ్యలకు గాను చెన్నైకి చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, పబ్లిషర్ బద్రి శేషాద్రిని పోలీసులు శనివారంనాడు అరెస్టు చేశారు.
కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించడం కోసం దేశవ్యాప్తంగా విధించిన అష్ట దిగ్బంధనం సమయంలో చిగురించిన ప్రేమ ముగ్గురి హత్యతో విషాదాంతమైంది. ఎంతో నమ్మకంతో పెళ్లి చేసుకున్న యువతిని, ఆమె తల్లిదండ్రులను ఆ యువకుడు కిరాతకంగా హత్య చేసి, పోలీసులకు లొంగిపోయాడు.
డెల్టా జిల్లాల్లో రైతులు సకాలంలో సాగుచేసేందుకు వీలుగా కావేరి జలాలను తక్షణమే విడుదల చేసేలా కర్ణాటక ప్రభుత్వానికి ఉత్తర్వులివ్వాలని
చెన్నై-తిరునల్వేలి(Chennai-Tirunalveli) మధ్య వందే భారత్ రైలు సేవలను ఆగస్టు 15వ తేదిలోగా ప్రారంభించనున్నట్లు దక్షిణ రైల్వే శాఖ జ
మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు ఉన్నత విద్యా శాఖ మంత్రి కె.పొన్ముడి, ఆయన కుమారుడు, పార్లమెంటు సభ్యుడు గౌతమ్ సిగమణి నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారంనాడు దాడులు జరిపింది. ఈ దాడుల్లో లెక్కల్లో చూపించని రూ.70 లక్షల రూపాయల నగదు, రూ.10 లక్షలు విలువచేసే విదేశీ కరెన్సీని ఈడీ స్వాధీనం చేసుకుంది.
తమిళనాడులో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. మనీలాండరింగ్ కేసులో అధికార డీఎంకే కీలక నేత, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కె.పొన్ముడి, ఆయన కుమారుడు ఎంపీ గౌతం సిగమణి నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. చెన్నై, విల్లుపురంలోని తండ్రికొడుకుల ఇళ్ల వద్ద ఈడీ దాడులు జరుగుతున్నాయి.
తమిళనాడులోని చెన్నై నగరంలో ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. 23 ఏళ్ల యువకుడి తలలో గుచ్చుకున్న రెండు అంగుళాల పొడవైన మేకును ఆరు గంటలపాటు శ్రమించి, తొలగించారు. బాధితుడు రెండు రోజుల్లోనే తనంతట తాను నడుస్తూ వచ్చి, మీడియాతో మాట్లాడగలిగారు.
కర్నాటక: బెంగళూరు నుంచి చెన్నై వెళ్లే డబుల్ డెక్కర్ రైల్లో ప్రమాదం జరిగింది. రైలు గుడియాత్తం స్టేషన్ చేరుకోగానే మంటలు వ్యాపించాయి. మంటలు, పొగలు గమనించిన రైల్వే సిబ్బంది రైలును స్టేషన్లో నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.