Share News

Venkaiah Naidu:m పదవీ విరమణే.. పెదవి విరమణ కాదు!

ABN , Publish Date - Jul 21 , 2024 | 04:47 AM

తాను పదవీ విరమణ చేశానే తప్ప, పెదవి విరమణ చేయలేదని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. వెంకయ్యనాయుడు 75వ జన్మదిన వేడుకలు, 50 ఏళ్లుగా రాజకీయాల్లో రాణించినందుకుగాను చెన్నైలో శనివారం సాయంత్రం ఆయన్ని నగరానికి చెందిన ప్రముఖులు సత్కరించారు.

Venkaiah Naidu:m పదవీ విరమణే.. పెదవి విరమణ కాదు!

  • ఆత్మీయ సత్కార సభలో వెంకయ్యనాయుడు

చెన్నై, జూలై 20 (ఆంధ్రజ్యోతి): తాను పదవీ విరమణ చేశానే తప్ప, పెదవి విరమణ చేయలేదని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. వెంకయ్యనాయుడు 75వ జన్మదిన వేడుకలు, 50 ఏళ్లుగా రాజకీయాల్లో రాణించినందుకుగాను చెన్నైలో శనివారం సాయంత్రం ఆయన్ని నగరానికి చెందిన ప్రముఖులు సత్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. మాజీ ప్రధాని వాజ్‌పేయి నెల్లూరులో పర్యటించినప్పుడు విద్యార్థిగా ఆయన్ని తొలిసారిగా చూశానని, తన 14వ ఏట ఆర్‌ఎ్‌సఎ్‌సలో చేరి క్రమశిక్షణ నేర్చుకున్నానని గుర్తు చేసుకున్నారు.


కేంద్ర మంత్రివర్గాల్లో, రాజ్యసభలో వచ్చిన అవకాశాలను అందరూ మెచ్చుకొనేలా సద్వినియోగం చేసుకున్నానని, భావితరాలు శ్రమతో ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆయన సూచించారు. ప్రధాని నరంద్ర మోదీ భారత్‌ను అగ్రరాజ్యాల సరసన నిలబెట్టి, భారతీయులకు మరింత ఘనత చేకూర్చారని, ఆర్థికంగా భారత్‌ త్వరలోనే అగ్రస్థానానికి చేరుకుంటుందని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.

Updated Date - Jul 21 , 2024 | 04:47 AM