Tamil Nadu: ఊరగాయ ఇవ్వని హోటల్‌కు రూ.35,000 జరిమానా!
ABN , Publish Date - Jul 26 , 2024 | 06:02 AM
భోజనం పార్శిల్‌తో పాటు ఊరగాయ ఇవ్వని ఓ హోటల్‌కు వినియోగదారుల ఫోరం రూ.35 వేల జరిమానా విధించింది. తమిళనాడు రాష్ట్రం విల్లుపురానికి చెందిన ఆరోగ్యస్వామి అనే వ్యక్తి ఓ ఆశ్రమానికి అందించేందుకు విల్లుపురంలోని ఓ ప్రముఖ హోటల్‌లో 25 భోజనాలు కొనుగోలు చేశారు.
చెన్నై, జూలై 25 (ఆంధ్రజ్యోతి): భోజనం పార్శిల్‌తో పాటు ఊరగాయ ఇవ్వని ఓ హోటల్‌కు వినియోగదారుల ఫోరం రూ.35 వేల జరిమానా విధించింది. తమిళనాడు రాష్ట్రం విల్లుపురానికి చెందిన ఆరోగ్యస్వామి అనే వ్యక్తి ఓ ఆశ్రమానికి అందించేందుకు విల్లుపురంలోని ఓ ప్రముఖ హోటల్‌లో 25 భోజనాలు కొనుగోలు చేశారు. అయితే హోటల్ సిబ్బంది భోజన పార్శిల్‌తో పాటు ఊరగాయ ఇవ్వలేదు.
ఈ విషయాన్ని ఆరోగ్యస్వామి యజమాని దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ కూడా నిర్లక్ష్య సమాధానమే వచ్చింది. దీంతో, ఆరోగ్యస్వామి విల్లుపురం వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఫోరం.. హోటల్ యాజమాన్యం ఆరోగ్యస్వామికి రూ.35 వేలు నష్టపరిహారం చెల్లించాలని గురువారం ఉత్తర్వులు జారీచేసింది.