Home » Chevella
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party)కు అభ్యర్థులు దొరకటం లేదని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (Konda Vishweshwar Reddy) అన్నారు. గురువారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేత జితేందర్‌రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా కలసి ఉండవచ్చని తెలిపారు. జితేందర్ రెడ్డి బీజేపీలోనే కొనసాగుతారని తనకు నమ్మకముందని చెప్పారు.
BRS Lok Sabha Candidates: తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు (Telangana Lok Sabha Polls) సమయం దగ్గరపడుతుండటంతో అభ్యర్థుల ఎంపికలో అధికార, ప్రతిపక్ష పార్టీలు నిమగ్నమయ్యాయి. మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకుగాను ఇప్పటికే పలువురు అభ్యర్థులను పార్టీలు ప్రకటించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అట్టర్ ప్లాప్ అయిన బీఆర్ఎస్ (BRS).. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి రాష్ట్ర ప్రజలు తమవైపే ఉన్నారని చెప్పుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది...
BRS MLA Kale Yadaiah: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ (Congress) పార్టీ హౌస్ ఫుల్ అవుతోంది. బీఆర్ఎస్ (BRS) తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ముఖ్య నేతలు ‘కారు’ దిగి హస్తం గూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. మరికొందరు ముహూర్తం ఫిక్స్ చేసుకుని రెడీగా ఉన్నారు..
Big Shock To BRS: పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్కు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే ఒక్కొక్కరుగా కీలక నేతలు, సిట్టింగులు పార్టీని వీడుతుండటంతో ‘కారు’ కాస్త పంచర్ అవుతూ వస్తోంది..!. ఇప్పుడు ఏకంగా గతంలో మంత్రిగా పనిచేసిన, పార్టీ కీలక నేత బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పేస్తుండటం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఆయన మరెవరో కాదు..
ప్రస్తుత ఎంపీ, మాజీ ఎంపీ మధ్య చోటుచేసుకుంది. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి ( MP Ranjith Reddy ) , మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ( Konda Vishweshwar Reddy ) ఒకరిపై మరొకరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసుకున్నారు.
రంగారెడ్డి జిల్లా: మొయినాబాద్ యువతి హత్య కేసులో మిస్టరీ కొనసాగుతోంది. సోమవారం పట్టపగలే యువతిని గుర్తు తెలియని దుండగులు హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. మంటల్లో కాలుతున్న యువతి మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
బీఆర్ఎస్ ( BRS ) లోక్‌సభ ఎన్నికల ( Lok Sabha Elections ) పై దృష్టి సారించింది. ఆయా జిల్లాలకు సంబంధించిన ఎంపీ స్థానాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) , మాజీ మంత్రి హరీశ్‌రావు ( Harish Rao ) కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ భవన్లో చేవెళ్ల లోక్‌సభ ( Chevella Lok Sabha ) కు సంబంధించిన సన్నాహక సమావేశం శుక్రవారం నాడు నిర్వహించారు.
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్పేట్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాతా(Mayor Chigirintha Parijata) నర్సింహారెడ్డి.. చేవెళ్ల ఎంపీ టికెట్‌పై గురి పెట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మహేశ్వరం అసెంబ్లీ టికెట్ దాదాపుగా ఆమెకే ఖరారు చేస్తూ పార్టీ అధిష్ఠానం జాబితా సైతం సిద్ధం చేసినప్పటికీ, చివరి నిమిషంలో కేఎల్ఆర్(KLR) పేరు ఖరారైంది.
చేవెళ్ల పార్లమెంట్ ( Chevella Parliament ) ఎన్నికల్లో బీఆర్ఎస్ ( BRS ) పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన లక్షా తొమ్మిది వేల మెజార్టీ కంటే ఎక్కువ వస్తుందని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి ( Ranjith Reddy ) తెలిపారు. సోమవారం నాడు చేవెళ్లలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ... ‘‘నన్ను చేవె్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని చెప్పారు. గెలుపే లక్ష్యంగా పని చేయాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు’’ అని రంజిత్‌రెడ్డి చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project) మొత్తం అవినీతిమయంగా మారిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో రూ.లక్ష కోట్లు దోచుకున్న సీఎం కేసీఆర్ అవినీతి కక్కిస్తామని పేర్కొన్నారు.