Konda Visveshwar Reddy: ఆటోడ్రైవర్లను మోసం చేసిన కాంగ్రెస్..
ABN , Publish Date - May 07 , 2024 | 11:00 AM
రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆటో డ్రైవర్లను మోసం చేసిందని వారి బతుకులను రోడ్డుపాలు చేసిందని చేవెళ్ల పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(Konda Visveshwar Reddy) అన్నారు.
- చేవెళ్ల పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆటో డ్రైవర్లను మోసం చేసిందని వారి బతుకులను రోడ్డుపాలు చేసిందని చేవెళ్ల పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(Konda Visveshwar Reddy) అన్నారు. శంషాబాద్ వైఎన్‌ఆర్ గార్డెన్‌లో మంగళవారం భారతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆటోడ్రైవర్లు లైట్‌వేట్ మోటార్ వెహికల్ డ్రైవర్లతో కొండా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల కోసం ప్రతినెలా జీవన భృతి కల్పిస్తామని చెప్పి మాట తప్పిందని విమర్శించారు. ఆటో డ్రైవర్లను రోడ్డు పాలు చేసిన కాంగ్రెస్ పార్టీకి సార్వత్రిక ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని ఆయన పిలుపు నిచ్చారు. తాను చేవెళ్ల(Chevella)లో ఎంపీగా గెలువగానే ఆటో డ్రైవర్లకు స్వయంగా ఆటోలు కొనుక్కొవడానికి లోన్లు కల్పించడంతో పాటు అర్హులందరికీ ప్రధాన మంత్రి ఆవాజ్ యోజన పథకం ద్వారా సొంత ఇంటికి పంపిస్తానని కొండా హామీ ఇచ్చారు. సమావేశంలో రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన భారతీయ మజ్దూర్ యూనియన్ ముఖ్య నాయకులు సభ్యులు, బీజేపీ నాయులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి: BRS: వరంగల్ బీఆర్ఎస్‌లో పార్టీ ఫండ్ రగడ
ఇంటింటి ప్రచారంలో సంగీతారెడ్డి
మహేశ్వరం: ఈ నెల 13 న జరగబోయే ఎన్నికల్లో కమలం పువ్వుగుర్తుపై ఓటు వేసి చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండావిశ్వేశ్వర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు ఆయన సతీమణి కొండా సంగీతారెడ్డి(Konda Sangeetha Reddy) విజ్ఞప్తి చేశారు. మంగళవారం మండలంలోని అమీర్‌పేట, మాణిక్యమ్మగూడ, కేకేబస్తీ, సుభాన్‌పూర్ గ్రామాల్లో మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి అందెల శ్రీరాములుయాదవ్‌తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మిద్దె సుదర్శన్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మాదవాచారి, మాజీ సర్పంచ్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి: Union Minister: ఎన్డీఏ కూటమికి 400కు పైగా స్థానాలు..
Read Latest News and Telangana News Here
Read Latest National News and Telugu News