Share News

ABN Big Debate: నాకు ఆ పదవి చాలు: కొండావిశ్వేశ్వర్ రెడ్డి

ABN , Publish Date - May 03 , 2024 | 08:55 PM

ABN Big Debate with Konda Vishweshwar Reddy: వాస్తవానికి తెలంగాణలో(Telangana) బీజేపీ(BJP) తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో దాదాపు అభ్యర్థులంతా ఉద్ధండులే ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో మిత్ర పక్షాల సహకారంతో గానీ.. సొంత బలంతోగానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలా ఎక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ..

ABN Big Debate: నాకు ఆ పదవి చాలు: కొండావిశ్వేశ్వర్ రెడ్డి
Konda Vishweshwar Reddy

ABN Big Debate with Konda Vishweshwar Reddy: వాస్తవానికి తెలంగాణలో(Telangana) బీజేపీ(BJP) తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో దాదాపు అభ్యర్థులంతా ఉద్ధండులే ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో మిత్ర పక్షాల సహకారంతో గానీ.. సొంత బలంతోగానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలా ఎక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ ఎంపీ అభ్యర్థులు కేంద్ర మంత్రి పదవులను ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని బిగ్ డిబేట్‌లో చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ముందు రాధాకృష్ణ ప్రస్తావించగా.. విభిన్నంగా స్పందించారు.


‘పదవులు వస్తే అందరూ తీసుకుంటారు. ఆశ ఉంటే తప్పేం లేదు కదా. అయితే, బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అయితే 24 గంటలు పనే ఉంటుంది. రెస్ట్ అనే ముచ్చటే ఉండదు. బీజేపీ ప్రభుత్వంలో మంత్రి అయితే.. కాంగ్రెస్‌లో మాదిరిగా ఎంజాయ్ చేయలేరు. నాకు మంత్రి పదవి కావాలని లేదు. కానీ, ఒక అడ్వైజరీ పోస్ట్ కావాలనుకుంటున్నాను. రీసెర్చ్ విభాగంలో బయోగ్యాస్ గానీ, ఏదైన విభాగంలో అడ్వైజరీ కమిటీలో పోస్ట్ ఇస్తే చాలు. నా అభిప్రాయాలను పంచుకోవాలనుకుంటున్నాను.’ అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు.


కేంద్ర మంత్రి పదవి కోసం ఉద్దండుల పోటీ..

వాస్తవానికి తెలంగాణ బీజేపీలో ఎంపీలుగా పోటీ చేస్తున్న వారిలో కిషన్ రెడ్డి, డీకే అరుణ, ఈటెల రాజేందర్, బండి సంజయ్, అరవింద్ వంటివారు సీనియర్ పొలిటీషియన్స్. వీరందరూ కేంద్ర మంత్రి పదవి కోసం పోటీ పడుతున్న వారిలో ఉన్నారు. అయితే, మహిళగా డీకే అరుణకు మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది. కానీ, ఆమె ఎంపీగా గెలవాల్సి ఉంటుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. కేంద్ర మంత్రి పదవి కోసం పోటీ పడే వారి సంఖ్య ఎక్కువ ఉండగా.. వీరిలో ఒకరో ఇద్దరికి మాత్రమే ఆ పదవి దక్కే ఛాన్స్ ఉంటుంది. మరి ఎవరిని కేంద్ర మంత్రి పదవి వరిస్తుందో తేలాలంటే ఎన్నికల ఫలితాల వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే.

For More Telangana News and Telugu News..

Updated Date - May 03 , 2024 | 08:55 PM