Hyderabad: 30 నామినేషన్ల తిరస్కరణ.. హైదరాబాద్‌లో 19, సికింద్రాబాద్‌లో 11
ABN , Publish Date - Apr 27 , 2024 | 11:54 AM
పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ముగిసింది. పలు కారణాలతో రెండు పార్లమెంట్‌ల పరిధిలో 30 నామినేషన్లను తిరస్కరించినట్టు అధికారులు తెలిపారు. మల్కాజిగిరి సెగ్మెంట్(Malkajigiri segment)లో అత్యధికంగా 77 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
- అత్యధికంగా మల్కాజిగిరిలో 77
హైదరాబాద్ సిటీ: పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ముగిసింది. పలు కారణాలతో రెండు పార్లమెంట్‌ల పరిధిలో 30 నామినేషన్లను తిరస్కరించినట్టు అధికారులు తెలిపారు. మల్కాజిగిరి సెగ్మెంట్(Malkajigiri segment)లో అత్యధికంగా 77 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. హైదరాబాద్ పార్లమెంట్‌కు 57 మంది నామినేషన్లు దాఖలు చేయగా 19 మంది నామినేషన్లను తిరస్కరించారు. 38 మంది నామినేషన్లను ఆమోదించారు. సికింద్రాబాద్(Secunderabad) పార్లమెంట్‌కు సంబంధించి 57 మంది నామినేషన్లు వేయగా.. 11 పత్రాలను తిరస్కరించారు. 46 నామినేషన్లు ఆమోదం పొందాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం అవసరమైన పత్రాలు సమర్పించని నామినేషన్లను తిరస్కరించినట్టు చెప్పారు. ఏ కారణంతో నామినేషన్లు తిరస్కరించామన్న వివరాలను సంబంధిత అభ్యర్థులకు అందజేస్తామన్నారు. తిరస్కరణకు గురైన అభ్యర్థులు డిపాజిట్ అమౌంట్‌ను తిరిగి ఇస్తామన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 29 వరకు గడువు ఉంది.
ఇదికూడా చదవండి: Hyderabad: బస్సు టికెట్ ధర నాలుగింతలు పెంచేశారు... రూ. 720 టికెట్ 3000కు..
చేవెళ్లలో 17 నామినేషన్ల తిరస్కరణ
చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో సరైన ఫార్మాట్‌లో లేని నామినేషన్లను తిరస్కరించారు. మొత్తం 64 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీటిలో అధికారులు 17 నామినేషన్లను తిరస్కరించారు. మిగిలిన 47 నామినేషన్లకు జిల్లా ఎన్నికల అధికారి శశాంక అమోదం తెలిపారు.
మల్కాజిగిరిలో..
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి 114 మంది అభ్యర్థులు 177 నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా రిటర్నింగ్ అధికారి గౌతం ఆధ్వర్యంలో జరిగిన స్ర్కూృటినీలో 77 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 37 మంది అభ్యర్థుల నామినేషన్లు మాత్రమే ఆమోదించినట్లు ఎన్నికల పరిశీలకులు డాక్టర్ రాజీవ్ శుక్లా తెలిపారు.
ఇదికూడా చదవండి: Telangana Politics: హీటెక్కుతున్న తెలంగాణం.. రేవంత్‌కు మరో సవాల్ విసిరిన హరీశ్ రావు
Read Latest National News and Telugu News