Home » Chhattisgarh
నక్సలైట్లు(Naxalites) ఆదివారం అర్ధరాత్రి మరో దారుణమైన ఉదంతానికి పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో నిర్మాణంలో ఉన్న రెండు బీఎస్ఎన్ఎల్ టవర్లకు నిప్పు పెట్టారు. ఆ తర్వాత నక్సలైట్లు పలు బ్యానర్లు, పోస్టర్లను కూడా అక్కడ వేశారు. అయితే ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుందనే వివరాలను ఇప్పుడు చుద్దాం.
రానున్న రెండూ మూడేళ్లలో దేశంలో మావోయిస్టు సమస్య పూర్తిగా సమసిపోతుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఆదివారం న్యూఢిల్లీలో అమిత్ షా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. పశుపతినాథ్ నుంచి తిరుపతి వరకు ఉన్న మావోయిస్టు కారిడార్‌లో ‘వారి’ జాడలే లేవన్నారు.
Encounter in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. 12 మంది మావోయిస్టులకు గాయాలయ్యాయి. కాగా, భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. దంతెవాడ, బీజాపూర్, నారాయణపూర్‌లో మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది.
Encounter in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ నారాయణ్‌పూర్, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్(Police Encounter) జరిగింది. ఇప్పటి వరకు ఇద్దరు మావోయిస్టులు చనిపోయినట్లు అధికారిక సమాచారం అందుతోంది. మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అబూజ్మడ్ రెక్వాయా అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది.
ఛత్తీస్‌గఢ్ లోని కవార్థా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న పికప్ వాహనం బోల్తాపడి 18 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది గాయపడ్డారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
Telangana: ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లపై మావోయిస్ట్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరిట ప్రెస్‌నోట్ విడుదలైంది. జనవరి నుంచి దండకారణ్యలో ఎన్కౌంటర్, క్రాస్ ఫైరింగ్ పేరుతో 107 మందిని పోలీస్ బలగాలు హతమార్చారని తెలిపారు. ఇప్పటి వరకు 27 సంఘటనలను ఫోర్స్ క్లెయిమ్ చేయగా, వాటిలో 18 తప్పుడు ఎన్కౌంటర్లు అని పేర్కొన్నారు.
లోక్‌సభ ఎన్నికల వేళ మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దండకారణ్యంలో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీ్‌సగఢ్‌లోని బీజాపూర్ జిల్లా పిడియా గుట్టల్లో కేంద్ర బలగాలు-మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు.
ఛత్తీస్‌గఢ్ లోని బిజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు, భద్రతా సిబ్బందికి మధ్య జరిపిన హోరాహోరీ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌లో భాగంగా గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పిడియా గ్రామం సమీపంలో ఈ ఎన్కౌంటర్ చేటుచేసుకుంది.
తన కన్న కొడుకు పెంపుడు కుక్కను చంపేశాడంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. అతడిపై కేసు కూడా నమోదు చేశాడు. ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది.
మావోయిస్టుల కంచుకోట అభూజ్‌మడ్ మరోమారు ఎరుపెక్కింది. మంగళవారం భద్రతాబలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మృతిచెందారు.