Chhattisgarh: భారీ ఎన్‌కౌంటర్ ఏడుగురు మావోలు మృతి..
ABN , Publish Date - May 23 , 2024 | 06:40 PM
Encounter in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. 12 మంది మావోయిస్టులకు గాయాలయ్యాయి. కాగా, భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. దంతెవాడ, బీజాపూర్, నారాయణపూర్‌లో మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది.
Encounter in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. 12 మంది మావోయిస్టులకు గాయాలయ్యాయి. కాగా, భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. దంతెవాడ, బీజాపూర్, నారాయణపూర్‌లో మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది. అబుజ్‌మద్‌లోని రెక్వాయా అడవుల్లో ఉదయం నుంచి ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఓర్చా పోలీస్ స్టేషన్ నుంచి ఇంద్రావతికి 25 కిలోమీటర్ల దూరంలోని నేషనల్ పార్క్‌లో ఈ ఎన్‌కౌంటర్ జరుగుతుంది. తొలిసారిగా మూడు జిల్లాల నుంచి 800 మంది భద్రతా దళాలు మేజర్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. కాగా, ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న జవాన్లంతా సురక్షితంగా ఉన్నట్లు ఏఎస్పీ రాబిసన్ గుడియా తెలిపారు. మావోయిస్టుల కోసం ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని.. మావోయిస్టుల్లో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.