Home » Chiranjeevi
ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. గెలుపు కోసం పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటిగా ఉంది. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఎన్డీయే కూటమి, మెగా ఫ్యామిలీ కష్టపడుతుంటే.. పవన్‌ను ఓడించే లక్ష్యంతో వైసీపీ వ్యూహలు రచిస్తోంది. ఈక్రమంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అన్నయ్య చిరంజీవి రంగంలోకి దిగారు. తమ్ముడిని గెలిపించాలంటూ ఓ ఎమోషనల్ వీడియోను రిలీజ్ చేశారు.
Andhrapradesh: ‘‘మన అభిమాన హీరో చిరంజీవినే అవమానించిన జగన్ ఇంటికి పంపే సమయం ఆసన్నమైంది’’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం మండపేట బహిరంగ సభలో జనసేనాని మాట్లాడుతూ... ముస్లిం, మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేస్తామని.. రైతాంగానికి తోడ్పాటు అందిస్తామని తెలిపారు.
పవన్ కల్యాణ్ భీమవరం సభలో చాకు కలకలం రేపింది. ఇద్దరు వ్యక్తులు చాకుతో సభకు హాజరయ్యారు. సదరు వ్యక్తుల కదలికలను అనుమానించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని వెదకగా జేబులో చాకులు లభ్యమయ్యాయి. భీమవరం బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు. టూ టౌన్ పోలీసులు అదుపులో ఇద్దరు యువకులు ఉన్నారు.
సినీనటులు చిరంజీవి తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం మంచిదని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) అన్నారు.
కర్ణాటక రాజధాని బెంగళూరులో తలెత్తిన నీటి సంక్షోభం కారణంగా అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. వందల మంది క్యూ లైన్లో నిల్చొని.. బిందెల్లో నీళ్లు పట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేని నీటి సమస్యని అక్కడి ప్రజలు ఎదుర్కుంటున్నారు.
రాజకీయాల్లో యుద్ధమే తప్ప బంధుత్వం ఉండదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. పులపర్తి రామాంజనేయులను జనసేన (Janasena)లోకి ఆహ్వానిస్తున్నానని చెప్పారు. రామాంజనేయులు రాక జనసేనకు చాలా కీలకమని అన్నారు. అన్యాయం జరిగితే యుద్ధం చేయడమే తనకు తెలుసునని చెప్పారు. గతంలో తాను గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పారు.
మాజీ మంత్రి హరిరామజోగయ్య ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి రాసిన ఘాటు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణలోని ఐదుగురు కళాకారులకు పద్మశ్రీ అవార్డులను ప్రకటించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించింది. శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు, చిరంజీవిని ప్రభుత్వం ప్రత్యేకంగా సన్మానించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు, చిరంజీవిని ప్రభుత్వం ప్రత్యేకంగా సన్మానించింది. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ..
పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, ప్రముఖ సినీ నటుడు చిరంజీవిని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కలిశారు. పద్మవిభూషణ్ అవార్డు రావడంపై శుభాకాంక్షలు తెలిపారు.