Share News

JaggaReddy: చిరు, పవన్‌లపై జగ్గారెడ్డి సంచలన విమర్శలు

ABN , Publish Date - Jul 19 , 2024 | 06:38 PM

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌‌లపై (Pawan Kalyan) టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) సంచలన విమర్శలు చేశారు. రైతులకు నష్టం జరుగుతుందని సినిమా తీసిన చిరంజీవి ఢిల్లీలో ధర్నా చేసిన అన్నదాతలకు ఎందుకు మద్దతివ్వలేదని ప్రశ్నించారు..

JaggaReddy: చిరు, పవన్‌లపై జగ్గారెడ్డి సంచలన విమర్శలు
Jaggareddy

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌‌లపై (Pawan Kalyan) టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) సంచలన విమర్శలు చేశారు. రైతులకు నష్టం జరుగుతోందని సినిమా తీసిన చిరంజీవి.. ఢిల్లీలో ధర్నా చేసిన అన్నదాతలకు ఎందుకు మద్దతివ్వలేదని ప్రశ్నించారు. పవన్, చిరంజీవి ఇద్దరూ బీజేపీకి ఎందుకు మద్దతిస్తున్నారని నిలదీశారు. సినిమాల్లో కోట్లు సంపాదిస్తున్న వీరు రైతుల కష్టాలను ఎందుకు పట్టించుకోవడం లేదు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. రైతుల పేరుతో సినిమా తీసి డబ్బులు సంపాదించి, ప్రధానమంత్రి మోదీకి వీరిద్దరూ మద్దతివ్వడం ఎంతవరకు సబబు..? అని జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.


ALSO Read: Crop Loan Waiver: రైతులకు బిగ్ అలర్ట్.. ఈ తప్పు అస్సలు చేయకండి..

కాంగ్రెస్‌‌లో ఉండుంటే..?

కాంగ్రెస్‌ పార్టీలో చిరంజీవి ఉంటే సరైన దారిలో ఉండేవారని... ఇప్పుడు పక్కదారి పట్టారని విమర్శించారు. బీజేపీ ఎన్నివేల కోట్ల రైతు రుణమాఫీ చేసిందో కేంద్రమంత్రి బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నీరవ్ మోదీ, లలిత్ మోదీ లాంటి వారికి రూ.16 లక్షల కోట్లు బీజేపీ మాఫీ చేసిందని.. ఇందులో ఒక్క రైతు అయినా ఉన్నారా? అని ప్రశ్నించారు. గతంలో దేశం మొత్తం రూ.71 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని అన్నారు. బీఆర్ఎస్ చరిత్ర అంతా అప్పులేనని చెప్పారు.


ALSO Read: YS Sharmila: తెలంగాణ ప్రభుత్వంపై షర్మిల ప్రశంసలు

నల్ల చట్టాలు తీసుకువచ్చి దేశ రైతులను ఆత్మహత్యలు చేసుకునేలా మోదీ ప్రభుత్వం చేసిందని సంచలన ఆరోపణలు చేశారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన చేస్తున్న రైతులను చంపేశారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కేంద్ర మంత్రుల కొడుకులు రైతుల మీద నుంచి బండ్లు ఎక్కించారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌కే పనికొస్తారని... పనికి పనికిరాడని ఆక్షేపించారు. రుణమాఫీ అమలు చేయడంతో రైతుల ఫోన్లలో మెసేజ్‌లు చూసి వారి ఇళ్లలో సంబరాలు జరుగుతున్నాయని అన్నారు.


బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు రాత్రి నిద్ర రావడం లేదని ఎద్దేవా చేశారు. గాంధీభవన్‌లో జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ పైసలతో ఫోన్లు అన్ని టింగు టింగు మంటున్నాయని అన్నారు. ఆగస్టు 15వ తేదీ లోపు రూ. 2 లక్షల మాఫీ అయిపోతుందని స్పష్టం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ పదేళ్లలో రూ.7 లక్షల కోట్ల ఆప్పులు చేసి రైతులకు ఇచ్చింది రూ.26 వేల కోట్లేనని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ 6 నెలల్లో రైతులకు ఇచ్చింది రూ. 31 వేల కోట్లు అని వివరించారు. ఇంకా నాలుగున్నర సంవత్సరాల టైం ఉన్నా 6 నెలల్లోనే ఇచ్చిన హామీలు నెరవేర్చామని ఉద్ఘాటించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Minister Ponguleti: కేసీఆర్ సర్కార్‌లో ఆర్థిక విధ్వంసం

IMD: ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. కమ్ముకొస్తున్న మబ్బులు

Raj Tarun-Malvi Malhotra: హీరో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా మెసేజ్ చాట్స్ లీక్.. లవ్ ప్రపోజ్ చేసిన..

Group-2 Exams: గ్రూపు-2 పరీక్షలు వాయిదా!?

Read More Telangana News and Telugu News

Updated Date - Jul 19 , 2024 | 08:04 PM