Home » CM Chandrababu Naidu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయన్ని వెంకయ్య చౌదరి కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త పన్ను తీసేశామని మంత్రి నారాయణ ప్రకటించారు. అమృత్ పథకానికి వైసీపీ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడంతో పథకం కింద ఇచ్చే నిధులు ఉపయోగించలేకపోయామని మంత్రి నారాయణ తెలిపారు.
వివాదాస్పద సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.
ఏపీలో రేషన్ బియ్యం స్మగ్లింగ్‌పై నియమించిన సిట్‌లో వైసీపీ సానుకూల డీఎస్పీలకు బాధ్యతలు అప్పగించడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది.డీఎస్పీలను మార్చాలని నిర్ణయించింది. వైసీపీ సానుకూల డీఎస్పీలను నియమించడంపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వారిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, ఇష్టానుసారంగా ఎక్స్‌లో ట్వీట్లు చేస్తున్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబును కోరారు.
వైఎస్సార్సీపీ హయాంలో ఎంతో కష్టపడి తీర్చిదిద్దిన ప్రభుత్వ స్కూళ్లను, విద్యారంగాన్ని నాశనం చేశారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. అమ్మకు వందనం పేరిట తల్లిదండ్రులకు సున్నం రాసి, వారిని దగాచేశారని జగన్ విమర్శించారు.
వైసీపీ దుష్టపాలనలో ఇబ్బందులు పడుతున్న కార్మికుల పక్షాన పోరాటాలు చేసిన గొట్టుముక్కల రఘురామరాజుకు కార్మికుల సంక్షేమ బాధ్యతలు అప్పగించడం స్వాగతించ పరిణామమని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహాకుంభ మేళా దేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా, సంస్కృతికి చిహ్నం గా నిలుస్తుందని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య వ్యాఖ్యానించారు.
మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ సందర్భంగా శనివారం ప్రతి పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థుల తల్లిదండ్రులకు వివిధ పోటీలు నిర్వహించారు. తరగతుల వారీగా విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు పంపిణీ చేశారు.