బిల్డింగ్ అడ్వయిజరీ కమిటీ చైౖర్మన్‌గా రఘురామ బాధ్యతల స్వీకారం
ABN , Publish Date - Dec 08 , 2024 | 05:25 AM
వైసీపీ దుష్టపాలనలో ఇబ్బందులు పడుతున్న కార్మికుల పక్షాన పోరాటాలు చేసిన గొట్టుముక్కల రఘురామరాజుకు కార్మికుల సంక్షేమ బాధ్యతలు అప్పగించడం స్వాగతించ పరిణామమని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు.
విజయవాడ(గవర్నర్‌పేట), డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): వైసీపీ దుష్టపాలనలో ఇబ్బందులు పడుతున్న కార్మికుల పక్షాన పోరాటాలు చేసిన గొట్టుముక్కల రఘురామరాజుకు కార్మికుల సంక్షేమ బాధ్యతలు అప్పగించడం స్వాగతించ పరిణామమని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. ఏపీ బిల్డింగ్ అదర్ కనస్ట్రక్షన్ వర్కర్స్ అడ్వయిజరీ కమిటీ చైర్మన్‌గా నియమితులైన గొట్టుముక్కల రఘురామరాజు విజయవాడలో శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ టీఎన్‌టీయూసీ నేతగా రాష్ట్రంలో ఏ కార్మికునికి అన్యాయం జరిగినా రఘు ముందుఉండేవారని ప్రశంసించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ పార్టీ కోసం కమిట్‌మెంట్‌తో పనిచేసేవారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. అందుకు పట్టాభి, రఘురామరాజు వంటివారే ఉదాహరణ అని తెలిపారు.
చంద్రబాబు స్పూర్తితో తామంతా ప్రజలకు అండగా ఉంటూ వారి కష్టాలు తీర్చేందుకే పనిచేస్తామన్నారు. రఘురామరాజు మాట్లాడుతూ చంద్రబాబు ఆశీస్సులతో తనకు చైర్మన్‌గా బాధ్యత అప్పగించినందుకు మంత్రి లోకే్‌షకు కృతజ్ఞతలు తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, టీడీపీ అధికార ప్రతినిధులు నాగుల్ మీరా, సయ్యద్ రఫీ, పుట్టగుంట విజయకుమార్, టీడీపీ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ దారపనేని నరేంద్ర, జనసేన విజయవాడ కన్వీనర్ అమ్మిశెట్టి వాసు, వివిధ కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు.