Home » CM Jagan
ఈ ఎన్నికల్లో సింపతి కోసం సీఎం జగన్ ప్రాదేయ పడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) అన్నారు. పొదిలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.
గుంటూరు లోక్ సభ తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తన పార్లమెంట్ పరిధిలో విసృతంగా ప్రచారం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ అంటే తనకు అభిమానం అని, ఆయన మాదిరిగా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. పనిలో పనిగా సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ (CM Jagan) మోసం చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. కైకలూరులో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వారాహి బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ గెలవడని ముద్రగడ పద్మనాభం ఛాలెంజ్ చేశారు. ఒకవేళ పవన్ కల్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ప్రకటించారు. ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని వివరించారు. ఆ అంశంపై వర్మ స్పందిస్తూ.. ఎన్నికల వరకు ఎందుకు ఇప్పుడే సిద్ధంగా ఉండు అని ప్రతి సవాల్ విసిరారు.
ముస్లిం రిజర్వేషన్లకు ఎలాంటి ఢోకా ఉండదని.. ఈ రిజర్వేషన్లు కొనసాగుతాయని ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ (MLC Iqbal) తెలిపారు. ముస్లింలకు మత ప్రాతిపదికన ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషిన్ వేసింది వైసీపీ (YSRCP) ఎంపీ ఆర్ క్రిష్టయ్య కాదా? అని ప్రశ్నించారు. రిజర్వేషన్లు తీసేస్తారంటూ కొంతమంది వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Andhrapradesh: ఏపీలో పెన్షన్ల కోసం పెన్షన్‌దారులు అష్టకష్టాలు పడుతున్నారు. మండుటెండలో బ్యాంకుల వద్ద పెన్షన్‌దారులు పడిగాపులు కాస్తున్నారు. చాలా అకౌంట్లు ఇన్ఆపరేటివ్ అయి ఉండటంతో.. అకౌంట్లను ఆపరేషన్లోకి తెచ్చేందుకు ఆధార్ కార్డు కాపీతో సహా దరఖాస్తు ఇవ్వాలని బ్యాంక్ అధికారులు ఆదేశాలు ఇస్తున్నారు. చదవురాని అనేక మంది పెన్షనర్లు దరఖాస్తులు నింపేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
పథకాల కొనసాగింపుపై జగన్ మళ్లీ పాత పాటే అందుకున్నారు. నరసాపురం సభలో జగన్ మాట్లాడుతూ.. పథకాలు కొనసాగాలంటే తనకు ఓటు వేయాలని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుకి ఓటు వేస్తే పథకాలకు ముగింపు పలుకుతారని తెలిపారు. పది రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందని.. గతంలో ఎన్నడూ జరగని.. చూడని విధంగా ఇంటికే మూడు వేల చొప్పున పెన్షన్లు ఇచ్చామన్నారు.
Andhrapradesh: ఏపీలో పెన్షన్‌దారులకు రెండో రోజు కూడా తిప్పలు తప్పడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా రెండవ రోజు కూడా ఫించన్‌దారులు బ్యాంకుల చుట్టూ తిరుతున్నారు. పెన్షన్‌దారులకు ఉన్న బ్యాంకు అకౌంట్లలో సగానికిపైగా ఇన్ఆపరేటివ్ అయి ఉన్నాయి. దీంతో అకౌంట్లను ఆపరేషన్లోకి తెచ్చేందుకు ఆధార్ కార్డు కాపీతో సహా దరఖాస్తు ఇవ్వాలని బ్యాంక్ అధికారులు ఆదేశాలు ఇచ్చారు.
Andhrapradesh: రాష్ట్రంలో పింఛన్ల పేరుతో వృద్ధుల ప్రాణాలతో జగన్ ప్రభుత్వం చెలగాటమాటమాడుతోందని ఏపీపీసీ ఛీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వృద్ధులను ఒక్కో నెల ఒక్కోరకంగా వీధుల్లోకీడ్చి పొట్టన పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. వృద్ధుల ఉసురు కొట్టుకోవద్దని సీఎస్‌కు సూచిస్తున్నానన్నారు.
ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ ఏపీలో వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆందోళనలో కనిపిస్తున్నారు. నిన్నటి వరకు గెలిచేది నేనేనంటూ చెప్పుకొచ్చిన జగన్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఏపీలో తాజా పరిస్థితులు చూస్తుంటే మాత్రం వైసీపీకి ఇబ్బందికరంగా ఉండనేది స్పష్టమవుతోంది. రోజురోజుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలం పెరుగుతోంది. బీజేపీ, జనసేనకు ఇచ్చిన సీట్లలో ఈజీగా గెలవచ్చని అంచనావేసిన వైసీపీ నేతలకు ప్రస్తుతం చుక్కలు కనిపిస్తున్నాయట.