AP Election 2024: సీఎస్ జవహర్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు.. వర్లరామయ్య ఆగ్రహం
ABN , Publish Date - May 03 , 2024 | 08:35 PM
ఎన్నికల సంఘాన్ని (Election Commission) తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నేతలు శుక్రవారం కలిశారు. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాకు ఏపీ పోలీసులపై టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య ఫిర్యాదు చేశారు. పోలీసు వాహనాలను ప్రజా రక్షణకు వాడాలని.. సీఎం జగన్ (CM Jagan) అవినీతి సొమ్ము ఓటర్లు చేరవేయడానికా వాడడం ఏంటని ప్రశ్నించారు.
అమరావతి: ఎన్నికల సంఘాన్ని (Election Commission) తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నేతలు శుక్రవారం కలిశారు. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాకు ఏపీ పోలీసులపై టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య ఫిర్యాదు చేశారు. పోలీసు వాహనాలను ప్రజా రక్షణకు వాడాలని.. సీఎం జగన్ (CM Jagan) అవినీతి సొమ్ము ఓటర్లు చేరవేయడానికా వాడడం ఏంటని ప్రశ్నించారు.పోలీసులు ఎందుకు ఇంత దిగజారి పోయారో డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం ఈ విషయాన్ని డీజీపీ ఎందుకు ఖండించట్లేదని నిలదీశారు.
Chandrababu: ‘ఈ మారణ హోమానికి ఏ1 జగన్, ఏ2 మీరే’.. పెన్షనర్ల కష్టాలపై చంద్రబాబు ఆగ్రహం
జగన్‌కు చెందని సాక్షి పేపర్‌లో వచ్చే వార్తలను అడ్వర్టైజ్ మెంట్‌గా, పెయిడ్ ఆర్టికల్స్‌గా భావించి అభ్యర్థుల లెక్కల్లో చేర్చాలని కోరారు.పోస్టల్ బ్యాలెట్లు 90 శాతం డిస్ట్రిబ్యూట్ చేశామని సీఎస్ జవహర్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని చెప్పారు. వృద్ధాప్య పింఛన్లు బ్యాంకుకు పంపితే వారు ఎలా వెళ్తారని.. ఎలా తెచ్చుకుంటారని ప్రశ్నించారు. రెండు రోజుల్లోనే 90శాతం పెన్షన్లు ఇచ్చామన్నారని.. అయితే అది వెళ్లింది బ్యాంకులకు కాదన్నారు. చాలా ఎకౌంట్లు ఫ్రీజ్ అయ్యాయని ఆ డబ్బులు తిరిగి ఇక్కడికే వస్తున్నాయని ఆరోపించారు.
Congress: శింగనమల బరిలో శైలజానాథ్.. సెంటిమెంట్ కలిసొస్తుందా!
సీఎస్ జవహర్ రెడ్డి నిర్ణయం వల్ల ఈరోజు ఎంతో మంది వృద్ధులు బాధలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎస్ జవహర్ రెడ్డి వృద్ధులపై కక్ష కట్టారని.. వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. జగన్ వృధుల ఉసురుకొట్టుకుంటున్నారని... వారిని ఆకలితో ఉంచుతున్నారని వర్లరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు.
AP News: మళ్లీ జగన్ వస్తే.. జరిగేది ఇదే..
Read Latest AP News And Telugu News