Share News

AP Elections 2024:జగన్‌కు వెన్నులో నుంచి భయం తెప్పించాలి: పవన్ కళ్యాణ్

ABN , Publish Date - May 03 , 2024 | 06:41 PM

ప్రజలు ఈ ఎన్నికల్లో సీఎం జగన్ రెడ్డికి (CM Jagan) వెన్నులో నుంచి భయం తెప్పించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. గిద్దలూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్‌, వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 AP Elections 2024:జగన్‌కు వెన్నులో నుంచి భయం తెప్పించాలి:  పవన్ కళ్యాణ్
Pawan Kalyan

ప్రకాశం: ప్రజలు ఈ ఎన్నికల్లో సీఎం జగన్ రెడ్డికి (CM Jagan) వెన్నులో నుంచి భయం తెప్పించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. గిద్దలూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్‌, వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీని అందలం ఎక్కిస్తే మన భవిష్యత్‌ను చంపేస్తారని అన్నారు. తనకు గిద్దలూరులో బలం ఉన్నా.. తెలుగుదేశం అభ్యర్థికి మద్ధతు ఇచ్చానని తెలిపారు.ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం త్యాగం చేశానని అన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే తెలుగు గంగ, గుండ్లమోటు ప్రాజెక్టులను ఏకం చేస్తామని మాటిచ్చారు.


Congress: శింగనమల బరిలో శైలజానాథ్.. సెంటిమెంట్ కలిసొస్తుందా!

గిద్దలూరులో తాగునీటి సమస్య లేకుండా చేస్తామన్నారు. జగన్ వెలిగొండ ప్రాజెక్టు‌ను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రాగనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి రైతాంగానికి సాగు, తాగు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. శ్రీకృష్ణ దేవరాయులు తవ్విన కంభం చెరువుని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం కంభం చెరువుని గాలికొదిలేసిందని విరుచుకుపడ్డారు. తాను ప్రకాశం జిల్లాలో పెరిగానని, ఇక్కడ కష్టాలు తెలుసు..ఒంగోలు, కనిగిరి సమస్యలు కూడా తెలుసునని చెప్పారు.తాను రైతు పక్షపాతినని.. గిద్దలూరు అభివృద్ధికి తోడ్పడతానని మాటిచ్చారు.


ఈ ప్రభుత్వ కల్తీమద్యం తాగి ఎంతోమంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది మరణాలకు జగన్ రెడ్డి కారణం అయ్యారని చెప్పుకొచ్చారు. ఆత్మగౌరవం లేకపోవడంతో వైసీపీ నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూటమిలోకి వచ్చారని తెలిపారు. ఓటును జగన్ విధేయతతో అడగట్లేదని.. రౌడీయిజంతో ఓటు అడుగుతున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో జగన్‌ను ఇంటికి పంపించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.


AP News: మళ్లీ జగన్ వస్తే.. జరిగేది ఇదే..

Read Latest AP News And Telugu News

Updated Date - May 03 , 2024 | 07:12 PM