AP Elections: కాపులకు జగన్ సీట్లు ఇవ్వడానికి కారణం అదే: పెమ్మసాని చంద్రశేఖర్ విసుర్లు
ABN , Publish Date - May 03 , 2024 | 04:31 PM
గుంటూరు లోక్ సభ తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తన పార్లమెంట్ పరిధిలో విసృతంగా ప్రచారం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ అంటే తనకు అభిమానం అని, ఆయన మాదిరిగా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. పనిలో పనిగా సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
గుంటూరు జిల్లా: మరో వారంలో ఆంధ్రప్రదేశ్ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ప్రజలను ఆకట్టుకునే పనిలో నేతలు బిజీగా ఉన్నారు. గుంటూరు లోక్ సభ తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. తన పార్లమెంట్ పరిధిలో విసృతంగా ప్రచారం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ అంటే తనకు అభిమానం అని, ఆయన మాదిరిగా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు.
‘పవన్ కళ్యాణ్ భావజాలం నాకు బాగా నచ్చింది. పవన్ కల్యాణ్ అంటే నాకు బాగా ఇష్టం. ప్రజల కోసం పవన్ కల్యాణ్ వచ్చారు. నేను కూడా ప్రజల కోసమే వచ్చాను. నీతి, నిజాయతి ఉన్నవారికి ఆవేశం ఉంటుంది. అందుకే మేం కలిశాం. ఎవరైనా కష్టంలో ఉంటే సాయం చేయటానికి ముందుకు వస్తారు. అన్ని కులాల వారితో కలిసి పని చేయటం వల్లే ఈ స్థాయికి వచ్చాను. ఎప్పుడో జరిగిన వర్గ వైషమ్యాలతో కృష్ణా, గుంటూరు జిల్లాలో ప్రజలు విడిపోయారు. వంగవీటి రంగా కుమారుడు రాధా ఇప్పుడు మంచి ఆశయంతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అందరం కలిసి ఉందాం అని’ పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు.
‘ మంత్రి విడదల రజిని చేసిందేమీ లేదు. అవినీతి చేసి సంపాదించిన డబ్బుతో గెలవాలని చూస్తున్నారు. ఓటమి భయంతో జగన్ కాపులకు సీట్లు కేటాయించారు. జగన్ వద్ద ఉండాలంటే ఆత్మాభిమానం చంపుకుని పనిచేయాలి. కులం కాకుండా గుణం చూసి ఓట్లు వేయాలి అని’ ప్రజలను పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు.
Read Latest AP News And Telugu News