Home » CM Jagan
రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. తక్షణం ఇసుక అక్రమాలను నిలిపివేయించాలని, ఈ వ్యవహారంపై ఈ నెల 16లోగా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని జగన్ సర్కారును ఆదేశించింది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ఫొటోల్లో ఉన్న అక్రమ ఇసుక తవ్వకాలు జరిగిన ప్రాంతాలను పరిశీలన చేయించాలని సూచించింది.
సార్వత్రిక ఎన్నికలలో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితిని కల్పించాలని, పోలింగ్ శాతం పెరిగేలా కృషి చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. ఓటమి భయంతో వైసీపీ ఊహించని స్థాయిలో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉన్నందున, పోలింగ్ చివరి నిమిషం వరకు పూర్తి స్థాయి అప్రమత్తతతో ఉండాలని నిర్దేశించారు.
ఒకవైపు బాదుడే బాదుడు! మరోవైపు... బాధలే బాధలు! ఇదీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలన సాగిన తీరు! నోరెత్తి మాట్లాడాలంటే భయం! ప్రశ్నించాలంటే భయం! ఎదురు తిరిగి మాట్లాడితే కేసులు, అరెస్టులు, లాక్పలో చిత్రహింసలు!
మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పోలింగ్ జరగనుంది. అభ్యర్థులు, పార్టీ నేతలు బిజీగా ఉండగా, మరికొందరు బెట్టింగుల్లో మునిగి తేలుతున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తోంది..? మెజార్టీ ఎంత ఉండనుంది..? మ్యాజిక్ ఫిగర్..? ప్రముఖుల బరిలో నిలిచిన చోట ఎవరు విజయం సాధిస్తారనే అంశాలపై రూ.కోట్లలో బెట్టింగ్ జరుగుతోంది.
గోదారోళ్ల వెటకారమే వేరు. ఏదైనా ఉతికి ఆరేస్తారు. మాటలో మర్యాద తప్పరు. గురీ తప్పదు. ఎన్నికలప్రచారం రెండునెలలకుపైగానే రంజుగా సాగి చిన్నగా గూటికి చేరుకొంటోంది. దీంతో ఎన్నికలపైనా గోదావరి జిల్లాల్లో సెటైర్లు పేలుతున్నాయి.
ఐదేళ్ల జగన్ పాలనపై తీర్పు చెప్పే రోజు రానే వచ్చింది. సోమవారమే పోలింగ్! ఓటు అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధం కండి! మీ కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, రాష్ట్రం బాగు కోసం ఓటేయండి
సర్వేలను తాను నమ్మనని వైసీపీకి ఈ ఎన్నికల్లో 17కు 175 అసెంబ్లీ సీట్లు గెలుస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ధీమా వ్యక్తం చేశారు. సీఎం, వైసీపీ అధినేత జగన్ రెడ్డి టార్గెట్ అదేనని.. ఆ టార్గెట్ కచ్చితంగా కొడతామని అన్నారు. ప్రభుత్వ పథకాలను ఎన్నికల కమిషన్ ద్వారా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు.
ఏపీలో ఉన్న పరిశ్రమలను ఐదేళ్లలో వైసీపీ (YSRCP) ప్రభుత్వం దెబ్బతీసిందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Purandeswari) అన్నారు. రాష్ట్రంలో కోళ్ల పెంపకం పెద్ద సంఖ్యలో జరుగుతుందని చెప్పారు. 2019కి ముందు కోళ్ల పెంపకానికి సంబంధించి రైతులకు ఇంట్రెస్ట్ సబ్సిడీ సౌకర్యం ఇచ్చేవారని తెలిపారు. 2019 నుంచి 2024 వరకు వారికి ఇచ్చే సబ్సిడీ పూర్తిగా ఎత్తేశారని మండిపడ్డారు.
Andhrapradesh: ‘‘నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి ఇంటికి ఐకాన్ స్టార్, హీరో అల్లు అర్జున్ వస్తే.. ఎమ్మెల్యే అనుచరులు జనసేన జెండాలు పట్టుకుని తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. ఇది తగునా?. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన పార్టీ జెండాలు పట్టుకొని చీకటి రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ ఒక రకమైన క్యాన్సర్లాంటిదని, ఆ పార్టీ తెలంగాణ సమాజానికి ప్రమాదకరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ వేలూనుకుంటే శాంతిని, భద్రతను మర్చిపోవాల్సిందేనన్నారు. బీజేపీ అడుగు పెడితే సమాజం నిట్టనిలువునా చీలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా, రాష్ట్రానికి పెట్టుబడులు, ఆదాయమూ రావని ఆందోళన వ్యక్తం చేశారు.