Home » CM Ramesh
బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌పై మంత్రి బూడి ముత్యాల నాయుడు సంచలన కామెంట్స్ చేశారు. నేడు ముత్యాల నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నుంచి, ఎన్నికల సంఘం నుంచి ఒత్తిళ్లు తెచ్చి తనపై అక్రమంగా కేసులు బనాయించాలని చూస్తున్నారన్నారు. నేర చరిత్ర, నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి సీఎం రమేష్ అని ఆరోపించారు. వాస్తవాలను వక్రీకరించి పోలీస్ యంత్రాంగం కూడా సీఎం రమేష్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు.
అనకాపల్లి జిల్లా: ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, వైసీపీ దౌర్జన్యాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని, పోలీసులు కళ్ళముందే ముత్యాల నాయుడు, వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారని, జరిగిన సంఘటనపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఫోన్ చేసిన స్పందించలేదని కూటమి అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు.
అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌పై (CM Ramesh) వైసీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. ఈ దాడిలో రమేష్‌కు స్వల్పగాయాలవ్వగా.. చొక్కా చిరిగిపోయింది. మరోవైపు.. ఆయన కారుతో పాటు కాన్వాయ్‌లోని మూడు కార్లపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. అయితే ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా వైసీపీ అరాచకాలు, ఆగడాలు ఆగట్లేదు. అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు రెచ్చిపోయిన ఘటన అందరికీ తెలిసే ఉంటుంది. సొంత బావమరిది అని కూడా చూడకుండా అధికారంను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు దౌర్జన్యం చేశారు.
ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి సంస్థ ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ‘ఏబీఎన్ బిగ్ డిబేట్’లో బీజేపీ నేత, అనకాపల్లి ఎన్డీయే కూటమి అభ్యర్థి వైఎస్ వివేకా హత్య ఈ ఎఫెక్ట్‌తో కడపలో వైఎస్ షర్మిల గెలుస్తుందా అని ప్రశ్నించగా ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ‘‘వైఎస్ షర్మిల గెలుస్తారో లేదో తెలియదు. కానీ షర్మిల, సునీత చెప్పేదానివల్ల జగన్ మోహన్ రెడ్డికి ఖచ్చితంగా నష్టం జరుగుతుంది’’ అని అన్నారు.
చిత్తూరులో ఎక్కడో సారా వ్యాపారం చేసుకునే వాడివి కదా..? చంద్రబాబు బినామీవి కదా అని ఆర్కే ప్రశ్నించారు. చంద్రబాబు గురించి అందరికీ తెలుసు.. ఎవరికైనా మేలు చేయాలంటే వెయ్యి సార్లు ఆలోచించేవారు. ఆ ఆరోపణలు తప్పు అని వివరించారు.
ఏబీఎన్ బిగ్ డిబేట్లో అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ పలు అంశాలను పంచుకున్నారు. అనకాపల్లిలో పోటీకి గల కారణం, అక్కడ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చావు కదా ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ ప్రశ్నిస్తే ఇవ్వలేదని సీఎం రమేష్ సమాధానం ఇచ్చారు. తన కంపెనీని పదేళ్ల క్రితమే వదిలేశానని.. షేర్లు మాత్రమే ఉన్నాయని అంగీకరించారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేముల రాధాకృష్ణతో జరిగిన బిగ్ డిబేట్లో భాగంగా.. వైఎస్ వివేకా హత్య కేసుపై అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ హత్య కేసులో ఏపీ సీఎం జగన్, భారతి ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు.
అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌తో ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అమిత్ షా, నరేంద్ర మోదీ మనసును అతి తక్కువ కాలంలో సీఎం రమేష్ చూరగొన్నారు. సీఎం రమేష్ తిమ్మిని బమ్మిని చేయగల నేర్పరి అని వేమూరి రాధాకృష్ణ ప్రశ్నించగా.. కన్విన్స్ చేయగల శక్తి ఆ దేవుడు తనకు ఇచ్చారని సమాధానం ఇచ్చారు.
సీట్ల కేటాయింపు జరిగిన తర్వాత గ్రాఫ్ డౌన్ అయ్యిందని ఆర్కే ప్రశ్నించగా అదేం లేదని సీఎం రమేష్ సమాధానం ఇచ్చారు. జగన్ బస్సుయాత్రకు క్రేజీ వచ్చిందని అసత్య ప్రచారం చేసుకున్నారని ఆయన వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానంద రెడ్డిని ఓడించింది తానేనని గుర్తుచేశారు. రాజ్యసభకు పోటీ చేస్తానని ప్రకటిస్తే.. సీఎం జగన్ భయపడ్డారని తెలిపారు. సీఎం జగన్ వైసీపీ నేతలతో చెప్పిన విషయం తనకు 5 నిమిషాల్లో తెలిసిందని చెప్పారు.