Share News

CM Ramesh: రామోజీరావు మరణం మీడియా రంగానికే తీరని లోటు

ABN , Publish Date - Jun 08 , 2024 | 10:55 AM

రామోజీరావు మరణం మీడియా రంగానికే తీరని లోటు అని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మీడియా, సినీ, టీవీ రంగాల్లో దిగ్గజంగా వెలిగిన రామోజీరావు మరణం బాధాకరమన్నారు. వ్యాపారాల్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని విజయపథంలో నడిపించిన మహా వ్యక్తి అని కొనియాడారు. ఒక భారతీయ వ్యాపారవేత్తగా, ఈనాడు గ్రూపు సంస్థల అధినేతగా ప్రపంచంలోనే గొప్ప పేరు సంపాదించుకున్న మహా మేధావి అని సీఎం రమేష్ కొనియాడారు.

CM Ramesh: రామోజీరావు మరణం మీడియా రంగానికే తీరని లోటు

విశాఖ: రామోజీరావు మరణం మీడియా రంగానికే తీరని లోటు అని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మీడియా, సినీ, టీవీ రంగాల్లో దిగ్గజంగా వెలిగిన రామోజీరావు మరణం బాధాకరమన్నారు. వ్యాపారాల్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని విజయపథంలో నడిపించిన మహా వ్యక్తి అని కొనియాడారు. ఒక భారతీయ వ్యాపారవేత్తగా, ఈనాడు గ్రూపు సంస్థల అధినేతగా ప్రపంచంలోనే గొప్ప పేరు సంపాదించుకున్న మహా మేధావి అని సీఎం రమేష్ కొనియాడారు.


ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు, ప్రచురణ కర్త ,మార్గదర్శి చిట్‌ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థల అధినేతగా గుర్తింపు పొందారు. రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూపు ఆధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించి అనేక మందికి ఉపాధి కలిపించారు. 2016లో భారత ప్రభుత్వం అతనిని దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌తో సత్కరించిందని సీఎం రమేష్ పేర్కొన్నారు.

Updated Date - Jun 08 , 2024 | 10:55 AM